728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 27, 2021

మంత్రివర్గ విస్తరణలో చిలకలూరిపేటకు చాన్సు దక్కేనా..!?

గుంటూరు: సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సి ఎం భావిస్తే... చిలకలూరిపేట బహిరంగ సభలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం... గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి దక్కించుకొనే ఛాన్స్ ఉంది.                      

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తున్నా.. కమ్మ వర్గానికి కృష్ణా లేదా గుంటూరు జిల్లా నుంచే ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్‌, మేకా వెంకట ప్రతాప అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.

టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కొత్త వ్యూహాలతో గుంటూరు జిల్లా నుండి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి ఎంపి అవడంతో ఆర్కేకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. 

గుంటూరు జిల్లా నుండి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేట నుంచి బిసి సామాజిక వర్గం నుంచి విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్‌ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాపు కోటాలో అంబటి రాంబాబుకు ఖాయమని చెబుతున్నారు. 

అయితే సామాజిక సమీకరణాలు, సీనియార్టీ ప్రకారం రానున్న ఎన్నికల్లో జిల్లాను సమర్థవంతంగా నడిపించే వ్యక్తికే మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.  

(ఇది కేవలం విశ్వసనీయ సమాచారం మాత్రమే)
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మంత్రివర్గ విస్తరణలో చిలకలూరిపేటకు చాన్సు దక్కేనా..!? Rating: 5 Reviewed By: NEWS UPDATE