728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 27, 2021

చిలకలూరిపేట బంద్ ప్రశాంతంగా...ఏయే పార్టీలు పాల్గొన్నాయంటే...


 చిల‌క‌లూరిపేట‌: 

ఐక్య పోరాటాల‌తోనే ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లింభిస్తున్న  మోడీ స‌ర్కారును గ‌ద్దె దించ‌వ‌చ్చ‌ని   అఖిల‌ప‌క్ష రాజ‌కీయ‌, ప్ర‌జా సంఘాల నాయ‌కులు తెలిపారు. భార‌త్ బంద్ సోమ‌వారం  చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో ప్ర‌శాంతంగా , సంపూర్ణంగా కొన‌సాగింది. అధికారంలో ఉన్న వైసీసీ ప్ర‌భుత్వం బంద్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఆర్టీసీ బ‌స్సుల‌ను ఆదివారం అర్ధ‌రాత్రి  నుంచి నిలిపివేయ‌టంతో బ‌స్సులు డిపోకే ప‌రిమిత‌మ‌య్యాయి. ముందుగానే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌లు, విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. సినిమా ధియేట‌ర్లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్ర‌భుత్వ, ప్రైవేటు బ్యాంకులు, పోస్టాఫీసు, వ్యాపార, వాణిజ్య సంస్థ‌లు మూత ప‌డ్డాయి. 

జోరువాన‌లోనూ క‌దం తొక్కిన కార్మికులు... 

ప‌ట్ట‌ణంలోని ఎన్ఆర్‌టీ సెంట‌ర్ అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం వ‌ద్ద నుంచి ర్యాలీ బ‌య‌లుదేరింది. తుఫాను ప్ర‌భావంతో ఉద‌యం నుంచి జోరుగా వ‌ర్షం కురుస్తున్నా వంద‌లాది మంది కార్మికులు, సంఘ నాయ‌కులు,  అఖిల‌ప‌క్ష రాజ‌కీయ‌పార్టీలు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు హాజ‌ర‌య్యారు. కేంద్రంలోని మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ న‌ర‌స‌రావుపేట సెంట‌ర్ నుంచి భాస్కర్‌సెంట‌ర్‌, చౌత్ర‌సెంట‌ర్‌, మెయిన్‌బ‌జార్‌, మార్కెట్ సెంట‌ర్‌, గ‌డియార స్థంబం సెంట‌ర్ మీదుగా క‌ళామందిర్ సెంట‌ర్ వ‌ర‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో తెరిచి ఉంచిన కొన్ని దుకాణాల‌ను అఖిల ప‌క్ష నాయ‌కులు మూయించి వేశారు. 

ఒక్క‌టై నిలుద్దాం.. మోడీ స‌ర్కార్‌ను సాగ‌నంపుదాం...

కళామందిర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యాల‌యంలో అఖిల ప‌క్ష రాజ‌కీయ‌, ప్ర‌జా సంఘాల నాయ‌కులు పాల్గొని ఒక్క‌టై నిలుద్దాం.. మోడీ స‌ర్కార్‌ను సాగ‌నంపుదాం అని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని మోడీ స‌ర్కార్ కార్మిక‌, రైతు, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అనుస‌రిస్తుంద‌ని, కార్పొరేట్ల‌కు దోచి పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ద్వ‌జ‌మెత్తారు. మూడు వ్య‌వ‌సాయ న‌ల్ల చ‌ట్టాల‌తో రైతుల జీవితాలు అంధకారం కానున్నాయ‌ని, సుమారు తొమ్మిది నెల‌లుగా రైతులు ఢిల్లీ వేదిక‌గా ఆందోళ‌న చేస్తున్నా ప్ర‌ధాని మోడీ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. మానిటైజేషన్ పైను పేరుతో ప్రభుత్వ,  ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, జాతీయ రహదారులు, క్రీడా మైదానాలు, స్టేడియంలు, రైల్వేస్టేషన్లు. రైల్వేలైన్లు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, బి.యస్.యస్.యల్ టవర్స్ ఇలా అన్నింటిని వనరుల సద్వినియోగం అంటూ ఆదానీ, అంబానీలకు  తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వినాశకర విధానం అమలు  అయితే దేశం, దేశ ప్రజలు అధోగతిపాలు కావాల్సిందేన‌ని, జాతి సంపదలను రక్షించుకోవడానికి ప్రతి పౌరుడు, ఉద్యోగి  కేంద్రంలోని బి.జె.పి. విధానాలపై తిరుగుబాటు ప్రకటించాలని పిలుపు నిచ్చారు. కార్య‌క్ర‌మంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ‌, ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి \షేక్ సుబాని, అఖిల ప‌క్ష జేఏసీ క‌న్వీన‌ర్‌, కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ‌, టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఇన‌గంటి జ‌గ‌దీష్‌, టీడీపీ రాష్ట్ర మ‌హిళా కార్య‌ద‌ర్శి షేక్ జ‌రినా సుల్తానా,  సీపీఎం డివిజ‌న్ కార్య‌ద‌ర్శి పేరుబోయిన వెంక‌టేశ్వ‌ర్లు,  న‌వ‌త‌రం పార్టీ అద్య‌క్షుడు రావు సుబ్ర‌మ‌ణ్యం, న‌ల్ల‌మ‌డ రైతు సంఘం క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ కొల్లా రాజ‌మోహ‌న‌రావు, రాష్ట్రీయ జ‌న‌క్రాంతి పార్టీ అధ్య‌క్షుడు షేక్ గౌస్‌, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్య‌క్షుడు అడ‌పా మోహ‌న్‌మాదిగ‌, ముస్లిం సంక్షేమ సంఘం  నాయ‌కులు షేక్ బాజి, హ్యూమ‌న్ రైట్స్ సంస్థ నాయ‌కులు షేక్ మునాఫ్‌, బీసీ సంక్షేమ సంఘం నాయ‌కుడు ఫృద్విరాజ్‌, ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు పేలూరి రామారావు,దాస‌రి వ‌ర‌హాలు, రైతు సంఘం నాయ‌కులు తాళ్లూరి బాబురావు, ఏపీ మ‌హిళా సంఘం ఏరియా కార్య‌ద‌ర్శి చేరుకుప‌ల్లి నిర్మ‌ల‌, నాయ‌కులు శివ‌లీల‌, సౌటుపల్లి నాగేశ్వరరావు,నరసింహ భారతి, టీడీపీ నాయ‌కులు షేక్ అజారుద్దీన్‌, వీరారెడ్డి, సీపీఎం నాయ‌కులు పోపూరి సుబ్బారావు, బొల్లు శంకర‌రావు,  లూధ‌ర్‌, సాతులూరి బాబు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు న‌సిరుద్దీన్ జర్నలిస్టు సంఘం తరఫున ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్ వలీ, చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు అల్లాబక్షు, అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రసాదు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు దాసు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట బంద్ ప్రశాంతంగా...ఏయే పార్టీలు పాల్గొన్నాయంటే... Rating: 5 Reviewed By: NEWS UPDATE