చిలకలూరిపేట: ఈ ఖాళీ స్థలము చిలకలూరిపేట పురపాలక సంఘానికి చెందినది... ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులు... ఇట్లు మున్సిపల్ కమిషనర్ చిలకలూరిపేట. అనే పేరుతో చిలకలూరిపేట పట్టణంలో సుమారు 15 చోట్ల ఈ ఫ్లెక్సీలను పురపాలక సంఘం వారు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎక్కడ ఈ ఫ్లెక్సీలను పెట్టారో తెలుసా... పట్టణంలో ఖాళీ స్థలాలు ఉండి పిచ్చి మొక్కలు పెరిగి, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు బెడదతో పిచ్చి మొక్కలతో చుట్టుపక్కల వారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన 15 చోట్ల ఈ విధంగా పురపాలక సంఘం వారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీ ఉన్న స్థల యజమాని మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి మా స్థలంలో ఫ్లెక్సీ ఎందుకు పెట్టారు? అని అడిగితే సదరు స్థలంలో ఉన్న మొక్కలను తీసి వేయించి... స్థలం శుభ్రంగా ఉంచుకోవాలని... అలా చేస్తే వెంటనే ఫ్లెక్సీ తొలగిస్తామని అంటున్నారు మున్సిపల్ అధికారులు. ఏది ఏమైనా పట్టణంలోని ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచితే కొంత మేరకు చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా సీజనల్ వ్యాధులు వ్యాపించ కుండా ఉండే అవకాశం ఉంది.

