728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 13, 2021

చిలకలూరిపేట: పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఆగ్రహం.. నిరసన వ్యక్తం చేసిన పార్టీల నాయకులు

చిల‌క‌లూరిపేట‌: ఏ.పీలో వైసీపీ విపక్షంలో ఉండగా.. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల పెంపు ఉండబోదని వైఎస్ జగన్ పదే పదే చెప్పేవారని, అధికారంలోకి వచ్చీ రాగానే యూటర్న్ తీసుకుని విద్యుత్ ఛార్జీల వడ్డన మాత్రం యథావిధిగా కొనసాగించేస్తున్నారని సీపీఐ, సీపీఎం, ప్ర‌జా సంఘాల నాయ‌కులు విమ‌ర్శించారు. విద్యుత్ స‌ర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీల‌కు నిర‌స‌న‌గా విద్యుత్ ఏడీఈ కార్యాల‌యం ఎదుట సోమ‌వారం నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ సుభానీ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు మాట్లాడుతూ ఏపీలో విద్యుత్ ఛార్జీల పేరుతో గతంలో ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానికి ఉండేదని, 1995 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణల్ని అమలు చేసే క్రమంలో విద్యుత్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడించి, చివరికి నిరసనకారులపై కాల్పుల దాకా వెళ్లిందన్న విష‌యాన్ని గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ పతనానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింద‌ని, ప్ర‌స్తుతం వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వ ప‌త‌కానికి విద్యుత్ ఛార్జీలు కార‌ణంగా నిల‌వ‌నున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజలు కరోనాతో ఆర్థికంగా చితికిపోయి అవస్థలు పడుతున్న సమయంలో వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ఛార్జీలు పెంచడం దారుణమని విమ‌ర్శించారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, ఆస్తి, చెత్త పన్ను, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి బతుకు జీవనం భారంగా మారిన పరిస్థితుల్లో విద్యుత్తు ఛార్జీల భారం సైతం ప్రజలపై పడే ప్రమాదం ఉందన్నారు పొలాల్లో వాడే విద్యుత్‌కు మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో రైతులు నష్ట పోతారని తెలిపారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంత‌రం పెంచిన విద్యుత్ చార్జీల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని కోరుతూ చిల‌క‌లూరిపేట-2 విద్యుత్ ఏఈ ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు వినతి ప‌త్రం అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష, కార్య‌ద‌ర్శులు పేలురి రామారావు, దాస‌రి వ‌ర‌హాలు,మహిళ సమాఖ్య ఏరియా కార్యదర్శి చేరుకుపల్లి నిర్మల, సౌటుపల్లి నాగేశ్వరరావు,నరసింహ భారతి, అగ్రిగోల్డ్ క‌స్ట‌మ‌ర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షుడు మంత్రునాయ‌క్, సీపీఎం నాయ‌కులు సాతులూరి బాబు, లూధ‌ర్‌, జాన్స‌న్‌, జ‌న‌క్రాంతి పార్టీ నాయ‌కులు షేక్ గౌస్‌, ఎమ్మార్పీఎస్ నాయ‌కులు అడ‌పామోహ‌న్,ఏ.పి గిరిజ‌న సంఘాల ఐక్య వేదిక నాయ‌కులు 
బి. శ్రీ‌నునాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఆగ్రహం.. నిరసన వ్యక్తం చేసిన పార్టీల నాయకులు Rating: 5 Reviewed By: NEWS UPDATE