చిలకలూరిపేటలో కోత ముక్క ఆడుతున్న స్థావరం పై పోలీసుల దాడి
చిలకలూరిపేట పట్టణ పరిధిలోని మార్కండేయ నగర్ వెనుక గల పొలాల్లో కోత ముక్క పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అర్బన్ ఎస్సై ఫిరోజ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 17000/- డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న ఇరువురు పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలియజేశారు.