చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామం బొడ్డురాయి సమీపంలో ఉన్న హోటల్ లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ యజమాని కొమిరిశెట్టి వెంకటేష్ ఉదయం గ్యాస్ స్టవ్ పై ఇడ్లీపాత్ర పెట్టి వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు ఎగసి పడ్డాయి. ఆందోళనతో జనం బయటకు పరుగులు తీశాడు. ఒక్కసారిగా మంటలు హోటల్ పాకకు అంటుకొని వ్యాపించాయి. లోపల ఒక ముప్పావు శాతం, రెండు ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్ ఉన్న సిలిండర్ ను బయటకు తెచ్చేందుకు వీలు పడకపోవడంతో కొద్దిసేపటి తర్వాత అది పెద్ద శబ్దం చేస్తూ పేలింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు మంటలను ఆర్పివేశారు.
చిలకలూరిపేట మండలం ఎడవల్లిలో అగ్నిప్రమాదం... పేలిన గ్యాస్ సిలిండర్