728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 26, 2021

ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న గా క‌ద‌లివ‌చ్చిన మ‌హిళా లోకం


 చిల‌క‌లూరిపేట‌: కరోనా కారణంగా ప్రజలకు పనులు లేక చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తుంటే  కేంద్రప్రభుత్వం నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుటం అమానుష‌మ‌ని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ సుబ్బాయ‌మ్మ విమ‌ర్శించారు.  ఏపీ మ‌హిళా స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని ఎన్ ఆర్‌టీ సెంట‌ర్‌లోధరల నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ  మంగ‌ళ‌వారం  ప్రజాబ్యాలెట్‌ కార్యక్రమం నిర్వహించాయి.  కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆమె ముందుగా ప్ర‌జాబ్యాలెట్‌ను ప్రారంభించి మాట్లాడారు. పెట్రోల్‌ ధర రోజువారీ పెరుగుదలతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబంపై రెట్టింపు భారం పడుతోందని వాపోయారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హిళా స‌మాఖ్య ఏరియా కార్య‌ద‌ర్శి చెరుకుప‌ల్లి నిర్మ‌ల మాట్లాడుతూ  కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రజాసంక్షేమం విస్మరించి పాలన సాగిస్తున్నారని, కార్పొరేట్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోజురోజుకూ గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నా పాలకులు కనీసం స్పందించడం లేదన్నారు. 

ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ సుభాని మాట్లాడుతూ  ఓ పక్క కరోనా కష్టాల్లో ప్రజలుంటే కేంద్ర సర్కారు ధరలు పెంచుతూ జనజీవితాన్ని మరింత చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు . అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, ఈ తగ్గిన ధరల ప్రయోజనాన్ని ప్రజలకు అందించక ప్రభుత్వం విశ్వాస ఘాతకానికి పాల్పడింద‌ని ఆరోపించారు. ధరలు తగ్గించకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో మ‌హిళా స‌మాఖ్య ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి ల‌లిత‌కుమారి, ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు పేలూరి రామారావు, దాస‌రి వ‌ర‌హాలు, వెంక‌ట‌ప్ప‌య్య మాస్టరు పాల్గొన్నారు. 

ప్ర‌జా బ్యాలెట్‌కు అనూహ్య స్పంద‌న‌.. 

ఏపీ మ‌హిళా స‌మాఖ్య ఏర్పాటు చేసిన ప్ర‌జా బ్యాలెట్‌కు అనూహ్య స్పంద‌న క‌నిపించింది. పెద్ద సంఖ్య మ‌హిళ‌లు స్వ‌చ్చంధంగా త‌ర‌లివ‌చ్చి పెరిగి ధ‌ర‌కు వ్య‌తిరేకంగా ఓటు వేశారు. ప్ర‌జా బ్యాలెట్‌కు  కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ‌, నాయ‌కులు న‌సిరుద్దీన్‌, ఉమ‌ర్‌, టీడీపీ నాయ‌కులు, స‌మ‌ద్‌ఖాన్‌, జ‌రీనా సుల్తానా, మ‌ల్లిబాబు, అజారుద్దీన్‌, అమ‌రార‌మాదేవి, పిల్లి కోటి త‌దిత‌రులు త‌ర‌లివ‌చ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పెరిగిన ధ‌ర‌ల‌పై త‌మ నిర‌స‌న తెలిపారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న గా క‌ద‌లివ‌చ్చిన మ‌హిళా లోకం Rating: 5 Reviewed By: NEWS UPDATE