728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 21, 2021

చిలకలూరిపేట: ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే రజిని


 చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో ముంపు ముప్పు వాటిల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్థానిక శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వారం రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ప‌ట్ట‌ణంలోని సంజీవ్‌న‌గ‌ర్‌, సాయికార్తీక్ సెంట‌ర్‌, అడ్డ‌రోడ్డు సెంట‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌భావం ఉండ‌టంతో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ఆయా ప్రాంతాల‌ను ఆదివారం సంద‌ర్శించారు. ఓగేరు వాగు వ‌ర‌కు ప‌ర్య‌ట‌న కొన‌సాగించారు. వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ‌ర్షం కురిసే ప్ర‌తి సారి ప‌ట్ట‌ణంలోని సంజీవ‌న‌గ‌ర్ బాగా ప్ర‌భావితం అవుతుంద‌ని, వ‌ర‌ద ఇళ్ల‌లోకి వ‌స్తుంద‌ని తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చాక డ్రెయిన్లు ఆధునికీక‌ర‌ణ‌, క‌ల్వ‌ర్టుల నిర్మాణం త‌దిత‌ర చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. సంజీవ‌న‌గ‌ర్‌లో మ‌రికొద్దిగా ముంపు నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంద‌ని, ఆ ప‌నులు కూడా పూర్తి చేస్తామ‌ని తెలిపారు. సాయికార్తీక్ సెంట‌ర్‌, అడ్డ‌రోడ్డు సెంట‌ర్‌ల‌లో వ‌ర‌ద నీరు నిలిచి ఉండ‌టాన్ని గ‌మ‌నించి, ఈ ప్రాంతాల్లో కూడా క‌ల్వ‌ర్టుల నిర్మాణం చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే ఉన్న క‌ల్వ‌ర్టుల‌ను వాడుక‌లోకి తీసుకురావాల‌న్నారు. అడ్డుగా ఉన్న పిచ్చి చెట్లను తొల‌గించాల‌ని చెప్పారు. 


సుబ్బ‌య్యతోట‌, గాంధీపేట‌ ముంపు నివార‌ణ చ‌ర్య‌లు


ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌ట్ట‌ణ న‌డిబొడ్డున ఉన్న సుబ్బ‌య్య‌తోట‌, గాంధీపేట లాంటి ప్రాంతాలు వ‌ర్షాలు భారీగా కురిసిన ప్ర‌తిసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని తెలిపారు. డ్రెయిన్ల పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయ‌ని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ముంపు శాశ్వ‌త ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక రూపొందించామ‌ని, ఈ మేర‌కు రూ.9 కోట్ల నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకెళ్లి నిధులు మంజూర‌య్యేలా కృషి చేస్తాన‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గారి వెంట మున్సిపల్ చైర్మన్ రఫాని,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,సొసైటీ అధ్యక్షుడు తోట బ్రహ్మస్వాములు, కౌన్సిలర్లు విడదల గోపి,కొచ్చెర్ల విజయలక్ష్మి, షేక్ యూసుబ్,నాయకులు బత్తినేని శ్రీను,గుత్తా యామలయ్య,కొచ్చెర్ల కిషోర్,ఇక్కుర్తి పవన్,బాజి,,కూనపురెడ్డి బలరాం మరియు పలువురు ఉన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE