728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 11, 2021

గుంటూరు రూరల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జిల్లా పోలీసు అధికారి

గుంటూరు రూరల్ పోలీస్...

రూరల్ జిల్లా ప్రజలకు పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి...

గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గడచిన కొన్ని రోజులుగా అక్కడక్కడ కొత్త వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మనం వింటువున్నాం...

ఇందుమూలంగా ప్రజలందరూ పగలు మరియు రాత్రి సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి.

మీ నివాస ప్రాంతాలలో ఎవరైనా గుర్తు తెలియని కొత్త వ్యక్తులు, అపరిచితులు,అన్య భాషలు మాట్లాడే వారు,వింత వేషధారణ కలిగిన వారు సంచరిస్తూ కనిపించినా

                      (లేదా)

 మీరు నివాసముండే ప్రదేశములలో ఎవరైనా క్రొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినా లేదా మీ గ్రామ శివారులలో గుడారాలలో నివాసము ఏర్పరచుకొని ఉంటున్నా,అట్టి వారి సమాచారాన్ని వెంటనే డయల్ 100కి గాని లేదా దగ్గరలోని పోలీస్ వారికి గాని తెలియపరచాలి.

ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు, పోలీస్ వారు నిరంతరం మీ ప్రాంతాలలో ముమ్మర గస్తీ తిరుగుతూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండెదరు.

          ఇట్లు
 జిల్లా పోలీస్ కార్యలయము,
  గుంటూరు రూరల్ జిల్లా.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు రూరల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: జిల్లా పోలీసు అధికారి Rating: 5 Reviewed By: NEWS UPDATE