చిలకలూరిపేట: చిలకలూరిపేట - పెదనందిపాడు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
చిలకలూరిపేట మండలంలోని మిట్టపాలెం గ్రామానికి చెందిన జి కశ్యప్ గ్రామంలో చిన్న హోటల్ నడుపుతున్నాడు. శనివారం సాయంత్రం తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై కిరణా సామాను తో వెళుతున్నాడు. పట్టణం దాటిన తర్వాత రైసు మిల్లుల సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొని తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ సాయినాథ్, పైలెట్ బాజివలి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
