728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 14, 2021

చిలకలూరిపేట రూరల్: చడ్డి గ్యాంగ్ అనుమానంతో ఐదుగురిని రూరల్ పోలీస్స్టేషన్కు అప్పగించిన గ్రామస్తులు... విచారిస్తున్న పోలీసులు

చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలోని రహదారిపై తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు బెల్లం అమ్ముకుంటూ వున్నారు.  వీరిపై  కొంత అనుమానం రావడంతో స్థానికులు రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఐదుగురిని స్థానిక యువకులు తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఐదుగురిని రూరల్ ఎస్సై రాజేషు విచారిస్తున్నారు.  ఐదుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు కాగా... వారి వద్ద ఆధార్ కార్డులు, సంబంధిత ఐడెంటిటీ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే వీరు చెడ్డి గ్యాంగ్ గా స్థానికులు అనుమానించి పసుమర్రు కు చెందిన యువకులు రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు చెబుతున్నారు. వీరిని విబారించిన  తర్వాత వారి వివరాలు తీసుకొని తెలుసుకొని  సమాచారం తెలియజేస్తాం అని రూరల్ ఎస్సై రాజేష్ మీడియాకు తెలియజేశారు. వీరు చెడ్డి గ్యాంగ్ అని పట్టణంలో ప్రచారం జరగడంతో రూరల్ స్టేషన్ కు అనేక మందిని తరలివచ్చారు .
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్: చడ్డి గ్యాంగ్ అనుమానంతో ఐదుగురిని రూరల్ పోలీస్స్టేషన్కు అప్పగించిన గ్రామస్తులు... విచారిస్తున్న పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE