728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 14, 2021

బొప్పూడి ప్ర‌స‌న్నాంజ‌నేయ‌స్వామి ఆల‌య నూత‌న పాల‌క మండ‌లి ప్ర‌మాణ‌స్వీకారం

చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో 41 ఆల‌యాల‌కు త్వ‌ర‌లోనే ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌ళ్ల‌ను ఏర్పాటుచేస్తామ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం బొప్పూడిలోని ప్ర‌స‌న్నాంజ‌నేయ‌స్వామి ఆల‌య నూత‌న పాల‌క‌మండ‌లి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం వేడుక‌గా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజరు కాగా,కొమరవల్లిపాడు సొసైటీ అధ్యక్షుడు తోట బ్రహ్మాస్వాములు అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ఆల‌యాల‌కు ట్ర‌స్టు బోర్డుల‌ను ఏర్పాటుచేయాల‌ని తాను ఇటీవ‌ల మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావును కోరాన‌ని, ఆయ‌న సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఆయా ఆల‌యాల‌న్నింటికీ నూత‌న ట్ర‌స్ట్ బోర్డులు రానున్నాయ‌ని చెప్పారు. బొప్పూడి కొండ‌పై వేంచేసి ఉన్న శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య అభివృద్ధికి ఇటీవ‌ల ప్ర‌భుత్వం రూ.1.7 కోట్లు కేటాయించింద‌న్నారు. బొప్పూడిలోని వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య అభివృద్ధికి నిధులు కావాల‌ని అడిగిన వెంట‌నే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఆయా అభివృద్ధి ప‌నులు కూడా మొద‌లుపెడ‌తామ‌ని చెప్పారు. దేవాల‌యాల అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని తెలిపారు. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని శివాల‌యం, పురుషోత్త‌మ‌ప‌ట్ట‌ణంలోని వేణుగోపాల‌స్వామి ఆల‌యం, చంఘీస్‌ఖాన్ పేట‌లోని వెన్న‌ముద్ద వేణుగోపాల‌స్వామి ఆల‌యం, కొండ‌వీడులోని ల‌క్ష్మీన‌ర‌సింహ ఆల‌యం.. ఇలా ఎన్నో ఆల‌యాల‌ను మ‌న ప్ర‌భుత్వం తిరిగి కొత్త‌గా నిర్మిస్తున్న‌ద‌ని తెలిపారు. టీటీడీ నుంచి కూడా ఆర్థిక సాయం అందుతున్న‌ట్లు చెప్పారు. ఆయా ఆల‌యాల అభివృద్ధికి సీజీఎఫ్ నుంచి నిధులు విడుద‌ల‌య్యాయ‌ని తెలిపారు. స‌హ‌జంగా వీటికి 25 శాతం దాత‌లుగాని, స్థానికులు గాని నిధులు స‌మ‌కూర్చాల్సి ఉంద‌ని, ఆ నిధులు కూడా ప్ర‌భుత్వ‌మే ఇచ్చేలా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశార‌ని చెప్పారు. 
ఆల‌య అభివృద్ధి మ‌న బాధ్య‌త‌
ఎమ్మెల్యే మాట్లాడుతూ బొప్పూడి ప్ర‌స‌న్నాంజ‌నేయ‌స్వామి ఆల‌యానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంద‌ని తెలిపారు. ఆల‌య చారిత్ర‌క నేప‌థ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త నూత‌న క‌మిటీ ఉంద‌ని తెలిపారు. దేవాల‌య‌ అభివృద్ధికి పాల‌క‌మండ‌లి కృషి చేయాల‌ని చెప్పారు. ఆల‌య అభివృద్ధికి తాను కూడా పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తాన‌న్నారు. అనంత‌రం పాల‌క‌మండ‌లితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. తొలుత ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య సిబ్బందికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ప‌ర్చూరి సుబ్బారావు ఆల‌య క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు. క‌మిటీ స‌భ్యులుగా నాదెండ్ల శ్రీనివాస‌రావు,రాయ‌పూడి నాగ‌మ‌ల్లేశ్వ‌రి, వంద‌మ‌నేని సుజాత‌, బొందిలి బ‌ల‌రామ్‌సింగ్‌, వ‌డితే క‌స‌నానాయ‌క్‌, ఏకాంబ‌రం సునీత త‌దిత‌రులు పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. కార్య‌క్ర‌మంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,ఎంపీపీ దేవినేని శంకరరావు,మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,జడ్పీటీసీ లు కాట్రగడ్డ మస్తాన్ రావు,ముక్తా వాసు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,రాష్ట్ర 15 వ ఆర్థిక సంఘం మెంబర్ కోట నాయక్,గ్రామ సర్పంచ్ రమేష్,మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బొప్పూడి ప్ర‌స‌న్నాంజ‌నేయ‌స్వామి ఆల‌య నూత‌న పాల‌క మండ‌లి ప్ర‌మాణ‌స్వీకారం Rating: 5 Reviewed By: NEWS UPDATE