728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 1, 2021

చిలకలూరిపేట: మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది... ఎమ్మెల్యే

మైనారిటీల సంక్షేమం ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషిచేస్తున్న‌దని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మండ‌ల‌కేంద్రం నాదెండ్ల‌లోని ఎస్సీ కాల‌నీలో చ‌ర్చి నిర్మాణ ప‌నులు త్వ‌ర‌లోనే పూర్తయ్యేలా కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. నాదెండ్ల‌లో నిర్మాణంలో ఉన్న చ‌ర్చిని బుధ‌వారం ఎమ్మెల్యే సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చ‌ర్చి నిర్మాణానికి రూ.40ల‌క్ష‌లు కావాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ని ప్ర‌త్యేకంగా క‌లిసి కోరిన‌ట్లు చెప్పారు. ఆయ‌న సానుకూలంగా స్పందించి, నిధుల విడ‌ద‌ల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని తెలిపారు. ఈ నిధులు త్వ‌ర‌లోనే మైనారిటీ వెల్ఫేర్ విభాగం నుంచి విడుద‌ల‌వుతాయ‌ని పేర్కొన్నారు ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ వివేక్ యాద‌వ్ నుంచి ప్ర‌భుత్వానికి అంచ‌నాలు కూడా వెళ్లాయ‌ని చెప్పారు. మైనారిటీల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేస్తున్న‌ద‌ని తెలిపారు. పేద‌ల‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌లకు ఆర్థిక లోటు లేకుండా చేశామ‌ని తెలిపారు. ఆమె వెంట మార్కెట్ యార్డు చైర్మ‌న్ మ‌ద్దిరాల విశ్వ‌నాథం, చిల‌క‌లూరిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ షేక్ ర‌ఫాని, నాదెండ్ల మండ‌ల జెడ్పీటీసీ కాట్ర‌గ‌డ్డ మ‌స్తాన్‌రావు, నాదెండ్ల సొసైటీ ప్రెసిడెంట్ సింగారెడ్డి కోటిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, నాదెండ్ల గ్రామ నాయకులు కాట్రగడ్డ రామకృష్ణ, కొనేటి నాగయ్య, మిరియాల లక్ష్మీనారాయణ, రాయపూడి చెంచు రాజా, ఇప్పర్ల చిన్న, పుల్లగూర రమేష్, విప్పర్ల చెంచు,రాయపూడి ప్రకాష్,రాయపూడి ప్రేమయ్య, బహుజంకు గిరిజ,వీసా సుధాకర్,కుడారి విజయ్,మరియు పలువురు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది... ఎమ్మెల్యే Rating: 5 Reviewed By: NEWS UPDATE