చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని 'జాతీయ విపత్తు' గా ప్రకటించి అన్ని విధాలుగా రైతాంగాని ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ , ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలను మద్దతు ధర ప్రకటించాలని, మిర్చి, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని, సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలపై,వ్యవసాయ యంత్రాలపై గతంలో యిస్తున్న రాయితీని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో గురువారంపట్టణంలోని ఎన్ ఆర్టీ రోడ్డులో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో మిర్చి, ప్రత్తి, మినుము, అరటి తదితర ఉద్యాన పంటలు, లక్షకు పైగా ఎకరాల్లో వరి పంట నష్టపోవటం జరిగిందని, జిల్లా వ్యాపితంగా మిర్చి పంటకు వైరస్ (తామర పురుగు) సోకి పంట నాశమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మిర్చి పంట పీకి వేసి దిక్కుతోచని స్థితిలో వున్నారని,ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులనుఆదుకునేందుకు ఎకరాకు రూ. 50 వేల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,పంటలు నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇచ్చి ప్రత్యామ్నాయ పంటల సాగుకు చర్యలు తీసుకోవాలని, ఖరీఫ్, రబీలలోని వ్యవసాయ రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, దేవాదాయ భూముల్లో పంట నష్టపోయిన కౌలు రైతులకు కౌలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అధ్యక్షత వహించగా, సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబాని, నాయకులు పేలూరి రామారావు, చంద్రా కొండలరావు, కొండ్రగుంట వెంకట్రావు, చినబాబు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట:పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి