728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 9, 2022

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన దారిదోపిడి అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్ట్: సీఐ సుబ్బారావు ను అభినందించిన రూరల్ ఎస్పీ


గుంటూరు: కర్నూలు జిల్లా నుండి వచ్చి ఒక ముఠా పొలాల్లో పని చేస్తానంటూ గుడిసెలు వేసుకొని కూలి పనులు చేసుకుంటూ గుంటూరు జిల్లాలోని పాలడుగు, లింగారావుపాలెం, సొలస గ్రామాల్లో బైక్ పై వస్తున్న వారిని అటకాయించి వారి వద్ద బంగారు నగలు కాజేసి మహిళలను  అత్యాచారం చేసిన వారిని గుంటూరు జిల్లా పోలీసు అధికారులు పట్టుకున్నారు.  చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బారావు దర్యాప్తు అధికారి గా జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ నియమించడంతో చాకచక్యంగా వ్యవహరించి ఎస్పీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు చెందిన దాసరి లింగయ్య నంద్యాల, దాసరి ఓబులేసు, దాసరి లింగయ్య, మేకులు చిందుకురు గ్రామం, దాసరి వెంకన్న పాణ్యం పట్టణం, ఇండ్ల రమణయ్య నంద్యాల,  ప్రాంతానికి చెందిన అరుగురిని స్పెషల్ టీమ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.  వీరిని ఈరోజు రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో పలు సెక్షన్ల పై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.  వీరిపై పలు జిల్లాలో కేసు నమోదైనట్లు రూరల్ ఎస్పీ తెలియజేశారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దర్యాప్తు అధికారి రూరల్ సీఐ సుబ్బారావును, ఈ టీంలో  ఉన్న పోలీస్ అధికారులను చిలకలూరిపేట నాదెండ్ల, ఎడ్లపాడు, రూరల్, టౌన్ అధికారులు అయిన అర్బన్ సిఐ రాజేశ్వరరావు, ఎడ్లపాడు ఎస్సై రాంబాబు,  నాదెండ్ల ఎస్సై సతీష్, ఏ ఎస్సైలు రవీంద్ర, రోసిబాబు, హెడ్ కొనిస్టేబులు అనిల్ కుమార్, మురళి కృష్ణ,మధు తదితరులను   జిల్లా రూరల్   ఎస్పీ విశాల్ గున్ని  అభినందించారు.  ముద్దాయిల పై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయి ఉంది. ఈ మీడియా సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతోపాటు నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు, చిలకలూరిపేట అర్బన్ సిఐ రాజేశ్వర రావు తదితరులు ఉన్నారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన దారిదోపిడి అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్ట్: సీఐ సుబ్బారావు ను అభినందించిన రూరల్ ఎస్పీ Rating: 5 Reviewed By: NEWS UPDATE