తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పటి నుంచే పాకులాడుతున్నాడని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. యడ్లపాడు మండలం కొండవీడు కోట అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి శనివారం మంత్రి బాలినేని విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ సుబ్బారావు గుప్తా మతిస్థిమితం లేని వ్యక్తి అని, అతడి కుటుంబసభ్యులే ఈ విషయం చెప్పారని, అతని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపారు. చంద్రబాబునాయుడుకు ధైర్యం లేదని, ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్, బీజేపీలతో పొత్తుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని పేర్కొన్నారు.
చిలకలూరిపేట:బీజేపీ, జనసేన కోసం చంద్రబాబు పాకులాట: మంత్రి బాలినేని