
చిలకలూరిపేట: ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమని, కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కరోనా కేసులు- తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో టీకాల పంపిణీ చాలా బాగుందని అభినందించారు. బూస్టర్ డోసు కూడా అందరికీ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా టెస్టులు కూడా నియోజకవర్గంలో వైద్యాధికారులు విరివిగా చేస్తున్నారని తెలిపారు. ఒకవేళ కరోనా విజృంభిస్తే పరిస్థితులు తలెత్తితే టెస్టులు విషయంలో సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. అన్ని సిద్ధం చేసి ఉంచుకోవాలని చెప్పారు. ఇప్పుడిప్పుడే పట్టణంలో కేసులు నమోదువుతున్న నేపథ్యంలో అన్ని టీస్టాళ్ల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీస్టాళ్లలో కూడా జనం గుమికూడకుండా చూడాలని చెప్పారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి టీస్టాళ్ల యజమానులతో సమావేశం నిర్వహించాలని, పరిస్థితి అర్థమయ్యేలా వివరించాలని, మాట వినని వారిపై చర్యలు తీసుకోవాని ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ ను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులన్నీ కోవిడ్‌కు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు వెంటనే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆటోల ద్వారా ప్రచారం చేయడం, కరపత్రాలు పంపిణీ చేయడం, ఫ్లెక్సీల ఏర్పాటు లాంటి కోవిడ్ అవగాహన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ రఫాని, యార్డు చైర్‌పర్సన్ ఎం.విశ్వనాథం పలు సూచనలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, వైద్యాధికారి గోపినాయక్ తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. చిలకలూరిపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూనల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కరోనా నియంత్రణలో తామంతా సహకరిస్తామని చెప్పారు. వ్యాపారులంతా నిబంధనలు తూచా తప్పకుండా చూస్తామమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ దేవరపల్లి రవీంద్ర,తహశీల్దార్ సుజాత,తహశీల్దార్ సురేష్ నాయక్,ఎంపీడీఓ లు మాధురి,హేమలత,మోషే,నోడల్ అధికారి గోపి నాయక్,డాక్టర్ సోమల నాయక్,డాక్టర్ కీర్తిమయు,డాక్టర్ శాంసన్,డాక్టర్ మౌనిక,డాక్టర్ రవితేజ నాయక్,డాక్టర్ నవీన్,డాక్టర్ కోటిరెడ్డి,డాక్టర్ భాగ్యలక్ష్మి ,యస్.ఐ లు ఫిరోజ్,మోహన్,సతీష్,శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇస్మాయిల్,శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి రాచమంటి చింతారావు,మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,బిట్రా రాజేంద్ర,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,తోట నాగలక్ష్మి,షేక్ ఖాజా భాను,నాయకులు శాపా సైదావలి,ఇక్కుర్తి పవన్,అన్నలదాసు శ్యాంపాల్,మోషే,కిలారు అశోక్,యాదాల సుజాత మరియు పలువురు పాల్గొన్నారు.



Advertisements