728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 16, 2022

చిలకలూరిపేట: బైక్పై వెళుతూ దారి విషయంలో ఘర్షణ... వ్యక్తి మృతి

చిలకలూరిపేట: ముందు వెళుతున్న ద్విచక్రవాహనం వెనుకనే వస్తున్న మరో ద్విచక్రవాహనానికి దారి ఇచ్చే విషయంలో జరిగిన దాడిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిలకలూరి పేటలో జరిగింది. పట్టణంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని గుర్రాల చావడి ప్రాంతానికి చెందిన షేక్ యాసిన్, ఇస్మాయిల్ ఖాన్ లు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నారు. వారి వెనుకనే మరో ద్విచక్రవాహనంపై బాజీ అతని కుమారుడు మాలిక్ వస్తున్నారు. బాజీ అదేపనిగా హారన్ మోగిస్తూ ముందు వెళ్తున్న వారిని సైడ్ ఇవ్వాలని హడావుడి చేశాడు. ఈ క్రమంలో వారు వాహనాన్ని పక్క కు తీసి వెళ్లాలని బాజీ కి సూచించారు. అయినా బాజి వారిని అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ముందు ద్విచక్రవాహనంపై వెనుక కూర్చొని ఉన్న ఇస్మాయిల్ ఖాన్(36) ఎందుకు అలా మాట్లాడతావు అంటూ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహం చెందిన బాజీ ఇస్మాయిల్ ఖాన్ పై దాడి చేశాడు. అసలే అనారోగ్యంతో ఉన్న ఇస్మాయిల్ ఖాన్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు కష్టమని చెప్పడంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించే లోపే ఇస్మాయిల్ ఖాన్ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో గుర్రాల చావడి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. నరసరావుపేట డిఎస్పి విజయ భాస్కరరావు, అర్బన్ సిఐ రాజేశ్వరరావు లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బైక్పై వెళుతూ దారి విషయంలో ఘర్షణ... వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE