యడ్లపాడు : మండలంలోని తిమ్మాపురం గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉన్నవ గ్రామానికి చెందిన కాకుమాను పార్ధసారధి పది సంవత్సరాలుగా తిమ్మాపురంలో నివాసం ఉంటున్నాడు. గత నెల ఏడో తేదీన ఉన్నవలో ఉంటున్న తల్లి సీతారావమ్మ మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులు తిమ్మాపురంలోని ఇంటికి తాళం వేసి ఉన్నవలోనే ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం పార్ధసారధి తిమ్మాపురంలోని ఇంటికి వచ్చి చూడగా మెయిన్ డోర్ తాళం పగలగొట్టి ఉండటం, లోపల తలుపులు తెరచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన రూ.75వేల నగదు, 3.5సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు చోరీకి గురైనట్లు గుర్తించాడు.
చిలకలూరిపేట నియోజకవర్గం: బంగారం, నగదు చోరీ... పోలీసులకు ఫిర్యాదు