చిలకలూరిపేట: ఒక పేషెంట్ ని తీసుకు వెళుతున్న అంబులెన్సు.. ఒక వ్యక్తిని ఢీకొనడంతో.. ఆ వ్యక్తి కూడా పేషంట్ అయి మరో అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్ళిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో చోటు చేసుకుంది. చిలకలూరిపేట గొర్రెల సంతలో పనిచేస్తున్న రాపూరి ఆంజనేయులు పట్టణంలోని నర్సారావుపేట సెంటర్లో టిఫిన్ తీసుకెళ్ళడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో ఆంజనేయులును ఒక ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొంది. దీంతో అతనికి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది శోభన్‌బాబు, శివ నాగా ఆంజనేయులు అతనికి ప్రాథమిక చికిత్స చేసి అతనిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
February 16, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఒక అంబులెన్సు ఢీ.. మరో అంబులెన్స్‌లో ఆసుపత్రికి..
Rating: 5
Reviewed By: NEWS UPDATE
