728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 31, 2022

చిలకలూరిపేట కౌన్సిల్ సమావేశం రసాభాస... వైసిపి, టిడిపి కౌన్సిల్ సభ్యుల నిరసన.... 4 వేలు లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేసిన వైసిపి కౌన్సిలర్


చిలకలూరిపేట పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం గురువారం ప్రారంభం కాకుండానే రసాభాసగా ముగిసింది.  అధికార పక్షం..... ప్రతిపక్షం నిరసన తెలియజేసిన తీరు  చిలకలూరిపేట పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ లో సంచలనానికి దారి తీసింది.

11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయిన కౌన్సిల్ సమావేశంలో మొదటగా టిడిపి కౌన్సిల్ సభ్యులు గంగా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్లకార్డులతో చైర్మన్ పోడియం వద్ద తమ నిరసనను తెలియజేశారు.  ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ రఫానీ స్పందిస్తూ వారిని తొలగించ లేదు అని ఎవరిని తొలగించమని తెలిపారు. 

వైఎస్సార్సీపీ అధికార పక్ష 11వ వార్డు కౌన్సిలర్ మాధవి రెడ్డి చైర్మన్ పోడియం వద్దకు వచ్చి తమకు వార్డులో విలువ లేకుండా పోతుందని... మంచినీరు కూడా ప్రజలకు అందజేయాలేని  స్థితిలో ఉన్నామని తమకు స్పష్టమైన హామీ కావాలని తెలిపారు. అనంతరం కింద కూర్చొని కౌన్సిలర్ మాధవి రెడ్డి నిరసన తెలియజేస్తూ ...ఈ ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళినా లంచాలు ఇవ్వాల్సిందేనని రెవెన్యూ అధికారులు తన వద్ద నాలుగు వేలు లంచం తీసుకున్నారని,  ఎంఆర్ఓ దగ్గరకు వెళితే మీకు పనులు చేయద్దు అని తెలిపారన్నారు.  ఇలా ఉంటే కౌన్సిలర్గా కొనసాలా అని తమ నిరసనను వ్యక్తం చేశారు. 11వ వార్డు కౌన్సిలర్ మాధవి రెడ్డి నిరసనలకు సంఘీభావం తెలియజేస్తూ టిడిపి కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ లోనే కింద కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు. 

అనంతరం అరగంట పాటు టిడిపి వైఎస్ఆర్సిపి సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగి... సమావేశం ప్రారంభం కాకుండానే అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్  తెలియజేశారు. అనంతరం కౌన్సిల్ హాల్ ఎదుట 11వ వార్డు మహిళలు మంచి నీళ్ళు కావాలని తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వార్డు కౌన్సిలర్ నిరసనను తెలియజేశారు.  టిడిపి కౌన్సిలర్లు  సైతం వారితో కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల తొలగింపు విషయంలో రెండు లక్షల రూపాయలు లంచం అడుగుతున్నట్లు, మున్సిపాలిటీకి కాంప్లెక్స్ గదులు ఇవ్వటానికి డబ్బులు అడుగుతున్నట్లు, బ్లీచింగ్ పౌడర్ లో కూడా భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు.  మంచినీరు సకాలంలో అందించాలని మున్సిపల్ అధికారుల మీద దుమ్మెత్తి పోశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద 11వ వార్డు మహిళలు కొంత సేపు ధర్నా చేయడంతో మున్సిపల్ చైర్మన్ వచ్చి మంచినీటి సమస్యను పదిరోజుల్లో పరిష్కరిస్తానని శుక్రవారం రోజు ఉదయం వార్డులో పర్యటిస్తారని హామీ ఇచ్చారు.

ఈ పరిణామాల మధ్య టిడిపి వైసిపి కౌన్సిలర్ల వాగ్వాదం లో సమావేశం రసాభాస. వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ విపక్ష మై గొంతెత్తరు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ రఫానీ, వైస్ చైర్మన్ వెంకటేశ్వరావు నువ్వు మాట్లాడుతూ టిడిపి కౌన్సిలర్లు కావాలనే సమావేశం జరగకుండా చేశారని కౌంటర్ ఇచ్చారు. చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సారథ్యంలో చిలకలూరిపేట అభివృద్ధి పదంలో నడుస్తుంది అని టిడిపి కౌన్సిలర్ కావాలని బురద జల్లుతున్నారని మంచినీటి సమస్య త్వరలో పరిష్కరిస్తానని మీడియాకు వివరించారు. ఈ మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ లు వైయస్ వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట కౌన్సిల్ సమావేశం రసాభాస... వైసిపి, టిడిపి కౌన్సిల్ సభ్యుల నిరసన.... 4 వేలు లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేసిన వైసిపి కౌన్సిలర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE