చిలకలూరిపేట: రెవెన్యూ అధికారులు ప్రజలను పీడిస్తున్నారనీ, స్వయానా ఒక వార్డు ప్రజా ప్రతినిధి తన వద్ద లంచం తీసుకొని పని చేస్తున్నారని గురువారం చిలకలూరిపేట కౌన్సిల్ హాల్లో చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒక విఆర్వో, రెవెన్యూ అధికారులు తన వద్ద లంచం తీసుకుని పనిచేశారని తెలపడంతో ఈ విషయం కాస్త జిల్లా ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం నుండి రెవెన్యూ అధికారులు ఎవరెవరి వద్ద లంచం తీసుకున్నారని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. లంచం ఇచ్చానని తెలియజేసిన వార్డు ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి శుక్రవారం స్టేట్మెంట్ తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.
April 1, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రెవెన్యూ అధికారులపై ఏసీబీ రహస్య విచారణ..!?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

