728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 16, 2022

చిలకలూరిపేట సచివాలయాల్లో పౌర సేవలు నిల్... వార్డుల్లో తిరుగుతున్నామని చెబుతున్న సిబ్బంది... ఆందోళనలో ప్రజలు

చిలకలూరిపేట:పేరుకే 560 సేవలు... కానీ ఆ సేవలు అందించే ఉద్యోగులు సచివాలయంలో లేక సేవలు పొందవలసిన పురప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిలకలూరిపేట పట్టణ పరిధిలో 29 సచివాలయాలు 560 సేవలు అందించాలి. కానీ గత వారం నుండి ఏ సచివాలయంలో సిబ్బంది లేక సంబంధిత సర్టిఫికెట్లు కావాల్సిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్క సచివాలయంలో 10 మంది సిబ్బంది తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీరిలో అడ్మిన్,డిజిటల్ అసిస్టెంట్,వెల్ఫేర్, శానిటరీ, టౌన్ ప్లానింగ్, వి.అర్. ఓ మొత్తంమీద పదిమంది వారివారి శాఖలకు సంబంధించి నిధులు నిర్వహిస్తుంటారు. 

అయితే గత కొద్ది రోజుల నుండి పట్టణ పురపాలక సంఘానికి సంబంధించి ప్రాపర్టీ టాక్స్ ఇళ్ళ వద్ద వసూలు చేయటానికి అడ్మిన్ లు ఇల్లు తిరుగుతున్నామని చెబుతున్నారు. అలానే టౌన్ ప్లానింగ్,అమెనిటీస్,అధికారులు పసుమర్రు వద్దగల హౌసింగ్ ప్రాజెక్టులో నిమగ్నమయ్యామని చెప్పకనే చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలో ఉండవలసిన వారు కూడా ఏదో ఒక సాకు చెప్పి వార్డులో తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఏఎన్ఎంలు వ్యాక్సినేషన్ పేరుతో వార్డులో నిమగ్నమైనట్లు వారు తెలుపుతున్నారు.  

అయితే మరి సచివాలయం లో ఉండి కావాల్సిన సేవలు పొందడానికి గత వారం నుండి ప్రజలు వెళుతున్న కానీ సచివాలయం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తమ పనులు ఎలా పూర్తి చేసుకోవాలని పనుల కోసం వెళ్లిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం నుండి ఈ పరిస్థితి ఉందని ఎవరికి వారు ఆయా పనులు పేరుచెప్పి ఆఫీస్ లో వుండటం లేదని వాపోతున్నారు. పౌర సేవలు సచివా లయంలో పొందటానికి ఒక అధికారి అయినా సచివాలయం లో ఉంచి అడంగల్ రెవెన్యూ తదితర పౌర సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట సచివాలయాల్లో పౌర సేవలు నిల్... వార్డుల్లో తిరుగుతున్నామని చెబుతున్న సిబ్బంది... ఆందోళనలో ప్రజలు Rating: 5 Reviewed By: NEWS UPDATE