728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 16, 2022

చిలకలూరపేట మున్సిపాలిటీలో ఒక్క పారిశుధ్య‌కార్మికున్ని తొల‌గించినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం...మీకు ధ‌న ధాహమా... రేపే ధర్నా


 చిల‌క‌లూరిపేట‌:

చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల పొట్ట‌లు గొట్టానికి, ధ‌న‌దాహంతో వారిని  తొల‌గించ‌టానికి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని, ఏ ఒక్క కార్మికుడ్ని తొల‌గించినా రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు సిద్ద‌మౌతామ‌ని ఏఐటీయూసీ అనుబంధ  ఏపీ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బందెల ర‌వికుమార్‌ హెచ్చ‌రించారు. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాల‌యంలో మున్సిపల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. ముందుగా సీపీఐ నేత సీఆర్ మోహ‌న్‌రావు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.  ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ర‌వికుమార్ మాట్ల‌డుతూ ఇటీవ‌ల బ‌దిలీ అయిన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఉన్న‌ప్పుడు కూడా ఇదే విధంగా మున్సిప‌ల్ పారిశుధ్య కార్మికుల‌ను తొల‌గించటానికి ఒత్త‌డి తెచ్చార‌ని, ఆయ‌న వ్య‌తిరేకించ‌టంతో ఇది నిలిచి పోయింద‌న్నారు. ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న పారిశుధ్య కార్మికులు 30నుంచి 40 మంది వ‌ర‌కు తొల‌గించి వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకొని డ‌బ్బులు దండుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు., అధికారం ఉంది క‌దా అని ఏ ఒక్క పారిశుధ్య కార్మికున్ని తొల‌గించినా ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌న్నారు. ఏ ఒక్క కార్మికుడ్ని తొల‌గించినా రాష్ట్ర‌వ్యాప్తంగా ఉద్య‌మం కొన‌సాగుంతుంద‌ని హెచ్చ‌రించారు. ఏ ఒక్క కార్మికుడ్ని తొల‌గించినా, కార్మికుల్లో ఎవ‌ర్ని ఇబ్బందులుకు గురి చేసినా కార్మికులంద‌రూ సంఘ‌టింగా నిల‌వాల‌ని పిలుపు నిచ్చారు. బాధిత కార్మికుల ప‌క్ష‌నా ఏపీ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ అండ‌గా నిలుస్తుంద‌ని హామీ ఇచ్చారు. కార్మికులు త‌మ‌కు అప్ప‌గించిన విధులు స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. 

నేడు మున్సిప‌ల్ కార్యాల‌యాల వ‌ద్ద ధ‌ర్న 

గడిచిన పదేళ్లలో ఘన, ద్రవ వ్యర్థాల పరిమాణం మరింత పెరిగిందని,. కానీ ఆ మేరకు కార్మికుల సంఖ్యను పెంచడం లేదని ఆరోపించారు. . ఒక మైక్రో ప్యాకెట్‌ 350 ఇళ్లకు పరిధిలో నలుగురు కార్మికులు పని చేయాల్సి ఉండగా ఒకరిద్దరితో పని చేయిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి  గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో వున్నప్పుడు  తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసి తీరుతామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని,. గద్దెనెక్కి మూడేళ్లు  గడుస్తున్నా ఉద్యోగాల పర్మినెంటు విషయమై ఉలుకూ పలుకూ లేదన్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వ ఉద్యోగులనే పేరుతో 'అమ్మ ఒడి' వంటి సంక్షేమ పథకాలను మున్సిపల్‌ కార్మికులకు అమలు చేయడం లేదు, క‌నీసం రేష‌న్ కూడా లేద‌ని వాపోయారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నంద‌ని,  ప్రజల్లో భాగస్వాములైన మున్సిపల్‌ కార్మికులు వృత్తిపరంగా వచ్చే సమస్యలతో పాటు నివాస ప్రాంతాల్లో వచ్చే సమస్యలు కూడా వారి కుటుంబాలను మరింత దయనీయంగా మార్చేస్తున్నాయ‌ని ఆదేవ‌న వ్య‌క్తం చేశారు. మున్సిప‌ల్ కార్మికుల‌ను ప‌ర్మినెంట్ చేయాలని, వారికి క‌నీస వేతనం 26వేలు అందించాల‌ని డిమాండ్ చేశారు. మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌లు పరిష్క‌రించాల‌ని కోరుతూ గురువారం  అన్ని మున్సిపాలిటీలు, న‌గ‌ర‌పంచ‌యితీలు,  మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ఎదుట ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. స‌మావేశానికి మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ చిల‌క‌లూరిపేట శాఖ అధ్య‌క్షుడు  కొమ్మ‌తోటి చెంచ‌య్య అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ‌, ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు పేలూరి రామారావు, దాస‌రి వ‌ర‌హాలు, ఏపీ మ‌హిళా స‌మాఖ్య ఏరియా కార్య‌ద‌ర్శి చెరుకుప‌ల్లి నిర్మ‌ల‌, మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ చిల‌క‌లూరిపేట ఉపాధ్య‌క్షులు బేయులప‌ల్లి చిన యోగ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరపేట మున్సిపాలిటీలో ఒక్క పారిశుధ్య‌కార్మికున్ని తొల‌గించినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం...మీకు ధ‌న ధాహమా... రేపే ధర్నా Rating: 5 Reviewed By: NEWS UPDATE