చిలకలూరపేట:వంటలకు ఉపయోగించే ఆయిల్ ను అధిక ధరలకు ఆమ్మి వినియోగదారుల వద్ద నుండి ముక్కు పిండి మరీ అధిక రేట్లు వసూలు చేయడాని కి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాపారులకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వరంలా మారింది. చిలకలూరిపేట పట్టణం లోని వ్యాపారులు వంట నూనెల ధరలను అమాంతం పెంచేసి ఒక కిలో ప్యాకెట్ కు 40 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలో రోజుకు 20 టన్నులు ఆయిల్ రీటెయిల్ షాపులకు సరఫరా చేస్తుంటారు. పట్టణంలోని అన్ని షాప్ లు కలిసి రోజుకు 20 టన్నులు ఆయిల్ ను విక్రయిస్తున్నారు. చిలకలూరిపేట లో ముగ్గురు ఏజెన్సీ దారులు ఆయిల్ను పట్టణంలోని అన్ని కిరాణా షాపులకు సరఫరా చేస్తుంటారు.
ఆదిలక్ష్మి ఏజెన్సీస్ కామేశ్వరి ఏజెన్సీస్, ఎస్సార్ ఆయిల్ వీరి ద్వారా పట్టణంలోని అన్ని షాపులకు శనగ నూనె, పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సరఫరా అవుతుంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు చిలకలూరిపేట పట్టణంలో సన్ ఫ్లవర్ ఆయిల్ 135 రూపాయలు, పామాయిల్ 125 రూపాయలు, శనగ నూనె నూట నలభై రూపాయలు అమ్ముతుండగా.... గత కొద్ది రోజుల నుండి రేట్లను అమాంతం పెంచేసి ఒక్కో కిలో ప్యాకెట్పై 30 నుంచి 40 రూపాయల వరకు అదనంగా వసూలు చేసి అమ్ముతున్నారు. సామాన్యుడు ఒక ప్యాకెట్ కొనాలంటే అధిక ధర చెల్లించి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎమ్మార్పై 135 ఉండగా 20 నుంచి 40 రూపాయలు అధిక ధరకు అమ్మడం ఇలా చిలకలూరిపేట లోని ఆయిల్ వ్యాపారులు సామాన్యుల్ని సైతం దోచుకుంటున్నారు. నిత్యావసరాల ధరలు పెంచి.... యుద్ధం పుణ్యమా అని... రోజుకు ఆయిల్ పై హోల్ సేల్ వ్యాపారులు దోపిడీ చేస్తూ లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరలను నియంత్రణ చేయవలసిన రెవిన్యూ డిపార్ట్మెంట్ కు చెందిన సివిల్ సప్లై అధికారులు నిద్ర నటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిలకలూరిపేట లో ఇప్పటివరకు పూర్తిస్థాయి సివిల్ సప్లయిస్ అధికారి లేకపోవడం గమనార్హం. గతంలో చిలకలూరిపేట కు చెందిన సివిల్ సప్లయిస్ అధికారి రెవెన్యూ అధికారి గా ప్రమోషన్ రావడంతో వెళ్ళిన అనంతరం... వినుకొండ కు చెందిన డి టి ఇప్పటి వరకు ఇంచార్జ్ అధికారి గా ఉన్నారు. ఆ అధికారి కి కూ డా ప్రమోషన్ రావడంతో ప్రస్తుతం మాచర్ల కు చెందిన అధికారి ఇన్చార్జి సివిల్ సప్లయిస్ అధికారి గా కొనసాగుతున్నారు. ధరలను నియంత్రించాల్సిన అధికారులు తనిఖీలు చేయకుండా ఉండటం వల్ల వ్యాపారులు రెచ్చిపోయి సామాన్యులు వద్దనుండి అధిక రేట్లను వసూలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
