చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో మద్దిరాల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం చిలకలూరిపేట మండలంలోని గోపాలంవారిపాలెంకు చెందిన యర్రసాని మరియదాసు(48) తన తోడల్లుడు కుమార్తె ఇంధిరను ద్విచక్రవాహనంపై తీసుకుని వస్తుండగా కట్టుబడివారిపాలెం ఈటీ సెంటర్‌కు చెందిన అచ్చి రవి మరో ద్విచక్రవాహనంపై ఎదురుగా వస్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యర్రసాని మరియదాసును చిలకలూరిపేట 108 సిబ్బంది మురళి, ఉమామహేశ్వరరావులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరియదాసు దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన ఇంధిర, అచ్చి రవిలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
చిలకలూరిపేట: రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు