728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 10, 2022

పల్నాడు జిల్లా మొదటి మహిళా మంత్రిగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినికి మంత్రి ప‌ద‌వి వరించింది. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఆనందానికి కార‌ణ‌మైంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో విడ‌ద‌ల ర‌జినికి స‌ముచిత స్థానం లభించటంతో చిలకలూరిపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చరిత్ర సృష్టించిన విడ‌ద‌ల ర‌జిని... 

విడదల రజిని యూఎస్ఏ దేశంలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రాసెస్ వీవర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. తాను రాజ‌కీయాల‌కు రాక ముందు నుంచే చిలకలూరిపేట నియోజకవర్గంలో వీఆర్ ఫౌండేషన్ ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రజని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ చరిత్ర లో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని నూత‌న అధ్యాయానికి తెర‌తీసారు. గ‌తం నుంచి కొన‌సాగుతున్న సాంప్ర‌దాయానికి భిన్నంగా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమెకు సీటు కేటాయించ‌టం, రాష్ట్ర మంత్రిగా ఉన్న సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుడు ప్ర‌త్తిపాటి పుల్లారావుపై అత్య‌ధిక మెజార్టీతో గెలుపొంద‌టంతో ర‌జిని రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు పొందారు. గెలుపొందిన నాటి నుంచి పేట నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో ఎన్న‌డు లేని అభివృద్దిని సాధించిపెట్టారు. మూడు సంవ‌త్స‌రాల కాలంలోనే నాటి పాల‌కుల పాల‌న‌కు ధీటుగా సంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లుగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల అభిమానం, ఆశీర్వాదాల‌తో పేట చ‌రిత్ర తిర‌గ‌రాస్తున్నారు.
వేల‌ కోట్ల రూపాయలతో అభివృద్ది..
వేల‌ కోట్ల రూపాయలతో చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ఆధ్వ‌ర్యంలో అంకురార్ప‌ణ చేశారు.ఇందులో చాలా వ‌ర‌కు ప‌నులు ప్రారంభం అయ్యాయి. నిధుల సాధ‌న కోసం క్ష‌ణం తీరిక లేకుండా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లిసి ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి ...ద‌శ‌ల వారీగా ప‌రిపాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు,నిధులు సాధిస్తున్నారు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌ని హామీల‌ను కూడా ఎమ్మెల్యే నెర‌వేరుస్తున్నారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌ని దాదాపు రూ. 1000 కోట్ల అభివృద్ది ప‌నుల‌కు సంబంధించి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ ఇప్ప‌టికే ప‌రిపాల‌నా ప‌ర‌మైన అనుమ‌తులు సాధించారు. అదేవిధంగా నిధులు కేటాయిచేలా ప్ర‌భుత్వం తో ప‌లు ధ‌పాలుగా చ‌ర్చలు జరిపి స‌ఫ‌లీకృతుల‌య్యారు. 

తాగునీటి స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం...

 వాట‌ర్‌ గ్రిడ్ ప్రాజెక్టులో చిల‌క‌లూరిపేట‌కు చోటు క‌ల్పించే విష‌య‌మై ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ ఓ స్థాయిలో పోరాట‌మే చేయాల్సి వ‌చ్చింది. రాష్ట్ర తాగునీటి ప్రాజెక్టుల్లోనే అతి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టులో తొలుత చిల‌క‌లూరిపేట‌ను చేర్చ‌లేదు.దీంతో పేట వాసులు శాశ్వ‌త తాగునీటి క‌ష్టాల‌కు చెక్ పెట్టాల‌నుకున్న విడ‌ద‌ల ర‌జినీ ....ఆఘ‌మేఘాల మీద స్పందించి అన్నీ ప‌నుల‌ను ప‌క్క‌న పెట్టి.... ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టులో పేట‌కు చోటు ద‌క్కేలా కృషి చేశారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల పేట‌కు రూ. 100 కోట్ల వ‌ర‌కు నిధులు మంజూరు కానున్నాయి. వీటిని ప్ర‌భుత్వ‌మే నేరుగా ప్రాజెక్టు నిర్మాణం కోసం వినియోగించ‌నుంది. ఎమ్మెల్యేగా గెలుపొందాక‌...గుర్రాల చావిడిలో జ‌రిగిన జ‌గ‌న‌న్న వార్డు బాట కార్య‌క్ర‌మంలో భాగంగా పేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ హామీనిచ్చారు. ఇంటింటికి న‌ల్లా ఇచ్చాకే 2024లో మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఓట్లు అడుగుతాను అని స్ప‌ష్టం చేశారు. దాని ప్ర‌కారంమే ...ప్ర‌తీ రోజు ప్ర‌తీ కుటుంబానికి 135 లీట‌ర్ల చొప్పున తాగునీటిని పంపిణీ చేసే అతి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టులో పేట‌కు చోటు దక్కేలా ఎమ్మెల్యే కృషి చేశారు. ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు కావాల‌ని పేట ప్ర‌జ‌లు అడ‌గ‌లేదు.అదేవిధంగా ఎన్నిక‌ల ముందు రజినీ కూడా హామీనివ్వ‌లేదు.పోనీ వ‌చ్చే 100 కోట్ల రూపాయ‌లు పేట‌కు నేరుగా విడుద‌ల చేసే ఆస్కారం కూడా లేదు. కానీ ప్ర‌జ‌ల తాగునీటి క‌ష్టాల‌కు శాశ్వ‌తంగా చెక్ పెట్టాల‌న్న‌ల‌క్ష్యంతో ర‌జినీ ఈ నిర్ణ‌యం తీసుకుని వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టులో పేట‌కు స్థానం కల్పించారు. ఇది మ‌రో రెండేళ్ల‌లో సాకారం కానుంది. దీనితో పాటు అమృత్ పథకానికి కావాల్సిన రూ.150 కోట్లలో రూ.83 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు సీఎం ఇప్ప‌టికే అంగీకరించారు.

విద్యాభివృద్దిలో ...

నాదెండ్ల మండ‌లం ఇర్ల‌పాడులో రూ. 30 కోట్ల అంచ‌నా వ్య‌యంతో కేంద్రీయ విద్యాల‌యాన్ని నిర్మిస్తున్నారు రూ.22 కోట్లతో ముస్లిం మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ‌ద‌శ‌లో ఉంది. . దీన్ని చిల‌కలూరిపేట మండ‌లం తాత‌పూడి గ్రామ రెవిన్యూ ప‌రిధిలో నిర్మించ‌నున్నారు .ఇది త్వ‌ర‌గా ఎమ్మెల్యే ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్నారు.ఇది పూర్త‌యితే 600 మంది నిరుపేద ముస్లిం బాలిక‌ల‌కు నాణ్య‌మైన విద్య‌తో పాటు ఉచిత భోజ‌న వ‌స‌తి సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇటీవ‌ల మండ‌లంలోని రాజాపేట గ్రామంలో రూ.5 కోట్ల నిధులతో బాలుర రెసిడెన్సీయ‌ల్ గురుకుల పాఠ‌శాల ప్రారంభించారు. గ‌తంలో ఇదే పాఠ‌శాల విద్యార్దులు ప‌ట్ట‌ణంలోని రేకుల షెడ్డులో అత్యంత ద‌య‌నీయ‌మైన ప‌రిస్థ‌తుల్లో ఉండే వారు. వారి క‌ష్టాన్ని చూసిన ర‌జిని స్వంత భ‌వ‌న నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు వంద శాతం పూర్తవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ ప‌నిచేస్తున్నా రు 

చిల‌క‌లూరిపేట అభివృద్ది ఒక చ‌రిత్ర 

నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం కోసం రూ.25కోట్లు మంజూరయ్యాయి. నాడు- నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.పట్టణాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న ఓగేరు వాగు మీదుగా వంతెన నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరుచేయించారు .చిలకలూరిపేట మండ‌లం పోత‌వ‌రం గ్రామ‌శివారులో ఆటోనగర్ నిర్మాణానికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించారు. గత ప్రభుత్వం ఆటోనగర్ కు భూమిని బదలాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏపీఐఐసీకి భూమిని బదలాయించకుండానే హడావుడిగా పనులు చేసి లబ్ధిదారులను దారుణంగా మోసం చేసింది. ఇటీవ‌ల ఈ ప‌నుల్లో కూడా క‌ద‌లిక మొద‌లైంది. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభ‌మ‌య్యాయి. ..పసుమర్రు గ్రామ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు రూ.4 కోట్లతో చేప‌ట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతే ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరుచేయించారు . ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ. చిలకలూరిపేటకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బైపాస్ రహదారి శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు. ఈ ప‌నులు వ‌చ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ.600 కోట్ల నిధులతో 16.3 కిలోమీటర్ల మేర, అత్యాధునికంగా, అన్ని హంగులతో నిర్మిస్తున్న ర‌హ‌దారి ప‌నులు ఇప్ప‌టికే 50శాతం పూర్త‌య్యాయి. .చిలకలూరిపేట పట్టణానికి రూ.12కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇప్ప‌టికే ప‌నులు కూడా ప్రారంభించేందుకు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీ శంకుస్థాప‌న‌లు కూడా చేశారు. చిలకలూరిపేట పట్ణణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. దీనికి అదనపు నిధులు, సురక్షిత నిర్మాణం అవసరం కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడారు. అదనంగా మరో రూ.10 కోట్ల నిధులు మంజూరుచేయించేందుకు కృషి చేశారు. మొత్తం రూ.30 కోట్ల నిధులు ఈ ఆస్పత్రికి అవసరం కాగా ప్ర‌భుత్వం కూడా ద‌శ‌ల వారీగా నిధులు విడుద‌ల చేసేంద‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. పట్ణంలో రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. . యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలకు నిధుల సమస్య లేకుండా కృషిచేస్తున్నారు. . దాదాపు 20 కోట్లతో ఈ పాఠశాలను నిర్మిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్ర‌జ‌ల కొండ‌వీడు కోట స‌మ‌గ్రాభివృద్ది కోసం రూ. 100 కోట్లు సాధించారు.దీంతో కొండ‌వీడు కోట ప్ర‌పంచ ప‌ర్యాట‌క కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. 
విడ‌ద‌ల ర‌జినికి క‌లిసొచ్చే అంశాలు ఇవే... 
విడ‌ద‌ల ర‌జిని రాష్ట్ర‌మంత్రిగా కావడంతో పేట‌లో జ‌రుగుతున్న అభివృద్ది రాష్టంలో కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంది. స‌మ‌స్య‌ల‌ను అర్ధం చేసుకోవ‌టం, వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా శ‌ర‌వేగంగా ఆలోచించ‌టం, వెంట‌నే కార్య‌రూపంలో పెట్ట‌డం ర‌జిని కు ఉన్న విద్య‌. విద్యావంతురాలు కావ‌టం, పేద ప్ర‌జ‌ల్లో మ‌మైక‌వ్వ‌డం, బీసీ మ‌హిళ కావ‌టం విడ‌ద‌ల ర‌జినికి క‌లిసి వ‌చ్చిన అవ‌కాశమ‌ని చెబుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పల్నాడు జిల్లా మొదటి మహిళా మంత్రిగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE