728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 15, 2022

చిలకలూరిపేట: వాగులో శవమై తేలిన నాలుగో తరగతి విద్యార్థి


చిలకలూరిపేట: రెండు రోజులు స్కూలుకు సెలవులు రావడంతో ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.  నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లోని హెచ్  జె బి స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న పట్నాల శ్రీనివాస్ (9) సంవత్సరాల విద్యార్థి ఈరోజు ఉదయం కుప్పగంజి  వాగులోని కుంటలో  శవమై తేలాడు.  పూర్తి వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు సంతానం.  రెండో సంతానమైన పట్నాల శివప్రసాద్ గణపవరం లోని స్కూల్ లో నాలుగో తరగతి చదువుతూ రెండు రోజులు సెలవులు కావడంతో ఈరోజు ఉదయం కుప్ప గజ్జి వాగు వద్ద కు వెళ్లి మృతి చెందడం జరిగింది  14 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా నుండి గణపవరం వచ్చి కూలి పనులు చేసుకుంటూ మొవ్వ వారి వీధిలో నివాసముంటున్నారు.  విద్యార్థి శ్రీనివాస్  మృతి చెందటంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వాగులో శవమై తేలిన నాలుగో తరగతి విద్యార్థి Rating: 5 Reviewed By: NEWS UPDATE