కరెంటు కోతతో చిలకలూరిపేట వాసులు నానా కష్టాలు పడుతున్నారు. ఏ సమయంలో కరెంటు పోతుందో తెలియక ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గత కొద్ది రోజుల నుండి కరెంట్ కోత జరుగుతుంది. కరెంటు ఏ సమయంలో పోతుందో తెలియకపోవడంతో విద్యుత్ సహాయంతో పనులు చేసుకునేవారు పనులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇది ఇలా ఉండగా విద్యుత్ కోతల సమయాలు చిలకలూరిపేటలో ప్రకటించకుండా అప్రకటిత విద్యుత్ కోతలు చేయటంతో ఇళ్ళల్లో ఉండే చిన్నపిల్లలు మహిళలు ఉక్కపోత భరించలేక రోడ్లపైకి వస్తున్నారు. బుధవారం మూడు సార్లు, రాత్రి కరెంటు కోతకు గురి కావడంతో చిలకలూరిపేటలో ప్రజలు విసిగి వేసారి పోయారు.
ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ నెల కావడంతో ఐదు పూట్ల నమాజ్ చదివే సమయమైన ఇషా 8:30 నుంచి 10 గంటల వరకు నమాజు చదువుకుంటారు. అయితే ఎనిమిది గంటలకు బుధవారం రాత్రి కరెంట్ తీయటంతో ముస్లింలు నమాజ్ చేసుకోడానికి ఇబ్బందులకు గురయ్యారు. వజు చేసుకోడానికి కరెంటు లేకపోవడంతో మసీదుల్లో నీరు కూడా దొరకలేదు. ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ నెలలో రాత్రిపూట కరెంట్ కోత సమయాలు ఏమిటని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా చిలకలూరిపేట లో విద్యుత్ కోత సమయాలు ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు..

