728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 6, 2022

చిలకలూరిపేట: విద్యుత్ ఘాతంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి.... లైన్మెన్, సహాయ లైన్మెన్ నిర్లక్ష్యంతో సంఘటన


 చిలకలూరిపేట: విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది.  ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం.... మైలా  రత్న బాబు (25) సుమారు మూడు సంవత్సరాలుగా పసుమర్తి పంచాయతీలో ఔట్సోర్సింగ్ ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. గ్రామంలో విద్యుత్ పవర్ మెయింటినెన్స్ నిమిత్తం మంగళవారం సహాయ లైన్మెన్ రాములు నాయక్ గ్రామంలోని విద్యుత్ కేంద్రం వద్దకు తీసుకువెళ్ళాడు.  అక్కడ విద్యుత్ స్తంభానికి ఫీడర్  మార్చాలని సూచించగా పోల్ పై ఎక్కిన  రత్నాబాబు విద్యుత్ ఘాతానికి గురై కింద పడి మృతి చెందాడు.  ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.  సహాయ లైన్మెన్ రాములు నాయక్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా...లైన్ మెన్ యోగేశ్వరరావు, సహాయ లైన్ మెన్ రాములు నాయక్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: విద్యుత్ ఘాతంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి.... లైన్మెన్, సహాయ లైన్మెన్ నిర్లక్ష్యంతో సంఘటన Rating: 5 Reviewed By: NEWS UPDATE