728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 5, 2022

ఆంధ్రప్రదేశ్లో మరో శ్రీలంకలా తిరుగుబాటు తప్పదు ....మాజీ మంత్రి ప్రత్తిపాటి


చిలకలూరిపేట: చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.  అంతే కానీ... మీరు ఎక్కడా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే అసంబద్ధంగా జిల్లాల విభజన చేశారనీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.  ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవ్వాళ ఉంటావ్ రేపు పోతావ్ కానీ కష్టాలు ఎవరికీ ప్రజలకేగా  అన్నారు.  నిన్న 26 జిల్లాలు అన్నారు... ఇవ్వాళ 27 జిల్లాలన్నారు ....రేపు 28 అనొచ్చు లేక 30 జిల్లాలు కూడా అనొచ్చన్నారు.


ఒక దశ దిశ లేకుండా సీఎం తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయేది ప్రజలు మాత్రమే, కనీసం మీ పార్టీకి చెందిన శాసనసభ్యులు చెప్పిన అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోలేదంటే ప్రజలు ఎంత నియంతృత్వ పాలనలో ఉన్నారో అర్థమవుతోందన్నారు ప్రత్తిపాటి.టిడిపి నాయకుడు చంద్రబాబు  చెప్పినట్లు రేపు తాము  అధికారంలోకి వచ్చాక ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అసంబద్ధంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దుతామన్నరు. పంచాయతీరాజ్ పిడి ఎకౌంట్స్ లోని డబ్బులన్నీ లాగేసి ఆ అకౌంట్స్ లో డబ్బులు లేకుండా జీరో బ్యాలెన్స్ చేసాడు ఎందుకు గెలిచామా అని సర్పంచులు బాధ పడే పరిస్థితులు తీసుకొచ్చాడనీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

అప్పుడు మేమే 85 శాతం గెలిచాం 90 శాతం గెలిచాం అంటూ గొప్పలు పోయారు దమ్ముంటే ఇప్పుడు మీరు ఎన్నికలకు రండి అని సవాల్ విసిరారు.  అప్పుడు వచ్చిన 80% గెలుపు ఇప్పుడు రివర్స్ అవ్వడం ఖాయం అంటూ పత్తిపాటి జోస్యం చెప్పారు. 

శ్రీలంకలో తిరుగుబాటు వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు.  కరెంట్ కోతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆంధ్రప్రదేశ్లో మరో శ్రీలంకలా తిరుగుబాటు తప్పదు ....మాజీ మంత్రి ప్రత్తిపాటి Rating: 5 Reviewed By: NEWS UPDATE