728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 5, 2022

పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట అధికారికి మొదటి మెమో జారీ చేసిన జిల్లా కలెక్టర్... ఇకనైనా చిలకలూరిపేట అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉంటారా...!?


చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ గా మొదటి రోజే బాధ్యతలు  తీసుకున్న  లోతేటి శివ శంకర్ సోమవారం సాయంత్రం హఠాత్తుగా చిలకలూరిపేట మండలం రాజాపేట లోని ఏపీ గురుకుల బాలుర సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.  అయితే మొదటి రోజే పల్నాడు జిల్లాలో చిలకలూరి పేట ఎంపీడీవో హెడ్ క్వార్టర్ లో ఉండటం లేదని హేమలత దేవి కు మెమో జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది.   పల్నాడు జిల్లాలో మొదటి రోజున జిల్లా కలెక్టర్ ఒక మండల స్థాయి అధికారి పై మెమో జారీ చేయడం కూడా వార్తల్లోకెక్కింది.  

ఇదిలా ఉండగా చిలకలూరిపేట మండలం లో పనిచేసే పలు కీలక శాఖలకు చెందిన అధికారులు స్వస్థలంలో ఉంటూ ఉద్యోగం చేసే ప్రాంతంలో ఉండకుండా హెచ్ ఆర్ డ్రా చేస్తున్నట్లు పలువురు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  కీలక శాఖల అయిన రెవెన్యూ,మునిసిపల్, సబ్ రిజిస్ట్రార్, వైద్య, తదితర శాఖల అధికారుల పై జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.  ఇకనైనా మండల స్థాయి అధికారులు పనిచేసే చోటే ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట అధికారికి మొదటి మెమో జారీ చేసిన జిల్లా కలెక్టర్... ఇకనైనా చిలకలూరిపేట అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉంటారా...!? Rating: 5 Reviewed By: NEWS UPDATE