చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోనీ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 మంది పోలీసులు బదిలీపై వచ్చారు. ఏ ఎస్ ఐ లు నలుగురు, హెడ్ కానిస్టేబుల్లు ఏడుగురు, కానిస్టేబుల్లు ఇద్దరూ చొప్పున బదిలీపై వచ్చారు.
చిలకలూరిపేట పట్టణానికి హెడ్ కానిస్టేబుల్ గా శ్రీను, పీటర్ రాజు, నారాయణ రెడ్డి, జార్జి బాబు, రమేష్ ... కానిస్టేబుల్ గా సత్య రావు పట్టణానికి బదిలీ అయ్యారు.
చిలకలూరిపేట రూరల్ ఎస్సైగా సీతారామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గా పౌల్ రాజశేఖర్ బదిలీపై నియమితులయ్యారు.
నాదెండ్ల మండల ఎస్ఐలుగా మల్లేశ్వరరావు, ఎండి గౌస్ హెడ్ కానిస్టేబుల్ గా కిషోర్ కుమార్ నియమితులయ్యారు.
ఎడ్లపాడు మండల ఏఎస్సై గా పూర్ణచంద్రరావు కానిస్టేబుల్ వరప్రసాద్ బదిలీపై నియమితులై ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం మీద 13 మంది పోలీసు శాఖలో నియోజకవర్గ పరిధిలోని అర్బన్, మూడు మండలాల్లో బదిలీపై వచ్చినట్లు ఉత్తర్వులు జిల్లా పోలీసు అధికారులు జారీ చేశారు.

