మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పీడ్ పెంచారు. వారం క్రితం ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం వద్ద జరిగిన ఉద్రిక్తతలో తనదే పైచేయి గా కొబ్బరికాయ కొట్టి పథకాన్ని ప్రారంభించటం జరిగింది. వారానికి రెండు సార్లు మాజీ మంత్రి పత్తిపాటి ప్రెస్ మీట్ లు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వై ఎస్ జగన్ ను తూర్పార పడుతున్నారు.
శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు అనడం... సీఎం జగన్ జరుగుతున్న అవినీతి గురించి ఆలోచించాలన్నారు. సీఎం రైతులకు న్యాయం చేయాలని ప్రత్తిపాటి కోరారు. రైతు రుణమాఫీ పథకం నేటికి సరిగ్గా అమలు కావడం లేదని మాజీ మంత్రి పత్తిపాటి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ సుజల పథకం వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎవరిని ఏమీ అనకపోయినా పోలీసులు అట్రాసిటీ చట్టం పై కేసులు పెట్టారని, టిడిపికి చెందిన దళిత మైనార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న చిన్న సెక్షన్లతో కేసులు నమోదు చేయడం పై ఆయన మండిపడ్డారు. మహానాడు కార్యక్రమంకు ప్రభుత్వం అడుగడుగునా మోకాలడ్డుతుందని, పర్మిషన్ ఇవ్వకుండా చేస్తుందని... అయినా టిడిపి ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని ప్రత్తిపాటి అన్నారు. మహానాడు కార్యక్రమాన్ని మేదరమెట్ల సమీపంలో నిర్వహిస్తున్నట్లు, 13 జిల్లాల నుండి భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేస్తారని మాజీ మంత్రి పత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.
