యడ్లపాడు: యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మద్దినేని వారి పాలెంకు చెందిన వారు గుంటూరు నుంచి లేలాండ్ లో ఒంగోలు వైపు వెళ్తు తిమ్మాపురం వద్ద భోజనం చేసేందుకు వాహనాన్ని నిలిపారు. భోజనం చేస్తుండగా గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కంటైనర్ వేగంగా భోజనం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనాలు వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఏడ్లపాడు పోలీసులు తెలిపారు. మృతులు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మద్దినేని వారి పాలెం గ్రామానికి చెందిన ఈదర రమణయ్య (55) మాల్యాద్రి (45) గాయపడిన వారిలో ఇరువురు మహిళలు చిన్నారి ఉన్నారు.

