చిలకలూరిపేట: తల్లిని బ్లేడుతో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేసులో కుమారుడిని చిలకలూరిపేట రూరల్ సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. చిలకలూరిపేట మండలంలోని పోతవరం, రాజాపేట మధ్య దార్ల ఆదిశేషమ్మ(65)ను ఆమె పెద్ద కొడుకు దార్ల వీరయ్య చంపాలనే ఉద్ధేశంతో ఆమెను మోటార్ సైకిల్‌పై పోతవరం గ్రామ శివారులోకి తీసుకువచ్చాడు. అక్కడ తనతో తెచ్చుకున్న బ్లేడుతో తల్లి ఆదిశేషమ్మ గొంతు కోసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆదిశేషమ్మను 108లో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. తల్లి హత్యకు పాల్పడిన మృతురాలి కుమారుడు దార్ల వీరయ్యను మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు పంపించినట్లు సీఐ అచ్చయ్య, ఎస్సై రాజేష్‌లు తెలిపారు.
చిలకలూరిపేట: తల్లిని గొంతుకోసి హత్య చేసిన కేసులో కుమారుడు అరెస్ట్