ఇకపై అన్ని రోగాలకు చిలకలూరిపేటలోని ప్రభుత్వాస్పత్రిలోనే అద్భుతమైన వైద్య చికిత్స అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలోని ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వాస్పత్రిని మంత్రి విడదల రజిని పరిశీలించారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీవీవీపీ, కుటుంబ సంక్షేమం కమిషనర్లు వినోద్, నివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేటలో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంతో తమ ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నదని చెప్పారు. దీని కోసం రూ.18.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 4.147 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. మరో రెండు నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు.
ఏకంగా 95 మంది సిబ్బంది
వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులను తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పునః సమీక్షిస్తున్న విషయం అందిరికి తెలిసిందేనని చెప్పారు. అందులో భాగంగా వంద పడకలు కానున్న చిలకలూరిపేట ఆస్పత్రికి ఏకంగా 95 మంది సిబ్బంది అందుబాటులోకి రాబోతున్నారని తెలిపారు. వీరిలో 23 మంది వైద్యులే ఉంటారని చెప్పారు. దాదాపు అన్ని స్పెషాలిటీలకు సంబంధించిన వైద్యులు అందుబాటులోకి వస్తారని, అన్ని రోగాలకు చిలకలూరిపేటలో చికిత్స అందే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని వివరించారు. నూతన ఆస్పత్రిలో లేబర్ బ్లాక్, ఎన్‌బీఎస్‌యూ, 12 పడకలతో పోస్టనెటల్ వార్డు, మరో 12 పడకలతో యాంటీ నెటల్ వార్డు, అల్ట్రాసౌండ్, ఓపీడీ రూమ్స్, ఓటీ బ్లాక్, ఐసోలేషన్ తదితర వసతులను సమకూర్చుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఆస్పత్రిని ట్రామాకేర్ సెంటర్‌గా మార్చేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బ్లండ్ బ్యాంకు ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని అధికారులకు చెప్పామన్నారు.
మరికొన్ని మౌలిక వసతులు
ఆస్పత్రికి చుట్టూతా రిటైనింగ్ వాల్, సిమెంట్ రోడ్లు, నూతన ఆస్పత్రిలో ఫర్మిచర్ తదితరాల కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని, ఆ నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ పనులు కూడా పూర్తిచేస్తామని తెలిపారు. మరో రెండు నెలల్లో నూతన ఆస్పత్రి ద్వారా అన్ని రకాల రోగాలకు చికిత్స అందజేస్తామని చెప్పారు.
ఆస్పత్రి తనిఖీ
మంత్రి విడదల రజిని ఉన్నతాధికారులతో కలిసి ఆస్పత్రి మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓపీ సేవలు, ఇన్ పెషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ ను పరిశీలించారు. లేబర్ వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులు వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తంచేశారు. మార్చురీ గదిని పరిశీలించారు. అక్కడ సమకూర్చాల్సిన వసతులపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో.....






