పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ సమీపాన ఉన్న పంట పొలాల్లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో ఎడ్లపాడు, నాదెండ్ల చిలకలూరిపేట మండలాలకు చెందిన పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పోలీసుల దాడిలో పేకాట ఆడుతున్న 21 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 57 వేల రూపాయలను ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎడ్లపాడు ఎస్ఐ పైడి రాంబాబు, నాదెండ్ల ఎస్సై సతీష్, చిలకలూరిపేట రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట: పేకాట స్థావరాలపై పోలీసుల దాడి ...21 మంది అరెస్టు