చిలకలూరిపేట పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం లో 36 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. సమావేశ అనంతరం టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చిలకలూరిపేటలో పిల్లలకు విష జ్వరాలు పెరిగాయని అన్నారు. గడపగడప కార్యక్రమం లో వున్న శ్రద్ద ఆరోగ్య శాఖ మీద పెట్టాలని గంగా శ్రీనివాసరావు అన్నారు. గంగా శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను వైసిపి కౌన్సిల్ సభ్యులు మౌలాలి, చైర్మన్ రఫానీ తీవ్రంగా ఖండించారు శానిటేషన్ బాగాలేదని అభివృద్ధి జరగటం లేదని గంగా శ్రీనివాసరావు చేసిన ఆరోపణను వైసీపీ సభ్యులు మౌలాలి తిప్పి కొట్టారు. తన వార్డులో 40 లక్షల రూపాయలు అభివృద్ధి జరిగిందని వచ్చి పరిశీలించమని ...అభివృద్ధి లేదనీ నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని మౌలాలి సవాల్ విసిరారు. ప్రతిపక్ష సభ్యులు వార్డుల్లో పర్యటించాలని వార్డులలో పర్యటించకుండా కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నారని మౌలాలి అన్నారు. అనంతరం ఈ విషయాలపై చైర్మన్ రఫానీ మాట్లాడుతూ టిడిపి వారు కావాలనే రాద్ధాంతం చేస్తున్నట్లు, శానిటేషన్ బాగుందని చిలకలూరిపేటలో వైద్య ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హోటల్లు తనిఖీలపై టిడిపి సభ్యుల పలు ఆరోపణలు చేశారు.
చిలకలూరిపేట: నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం... కౌన్సిలర్ మౌలాలి .... ప్రతిపక్ష సభ్యులు వార్డుల్లో తిరగరా... ప్రశ్నించిన కౌన్సిలర్