చిలకలూరిపేట రూరల్:
ఈతకు వెళ్లిన ఒక యువకుడు చిలకలూరిపేట లోని రూరల్ పరిధిలోని ఓగేరు వాగులో గల్లంతయ్యాడు. చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామానికి చెందిన బత్తుల అనిల్ (21) మరియు అంకమ్మరావు అనే ఇరువురు యువకులు పురుషోత్తపట్నం నుండి పోతవరం వెళ్లే మధ్యలో ఉన్న వోగేరు వాగులో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో అనిల్ నీటిలో దిగి బయటకు రాకపోవడంతో అంకమ్మరావు ఇచ్చిన సమాచారం మేరకు వారి బంధువులు రూరల్ పోలీసులు గురువారం రాత్రి అనిల్ కోసం గాలించారు. అయితే రాత్రి పది గంటల 30 నిమిషాల వరకు గాలింపు చేపట్టిన అతని జాడ తెలియలేదు. దీంతో అనిల్ తల్లిదండ్రులు, బంధువులు వాగు వద్ద అనిల్ జాడ కోసం వేచి ఉన్నారు. శుక్రవారం ఉదయం వాగులో అనిల్ కోసం గాలించగా...అనిల్ మృతి చెంది అతని మృతదేహం నీటిలో లభ్యమయింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నారు.

