చిలకలూరిపేట: అమెరికా దేశంలో సాధ్యం కాని సమస్యను పరిష్కరించి సంతన భాగ్యం కలిగించిన వరలక్ష్మీ ఆసుపత్రి. మాతృత్వం మహిళకే కాదు... దంపతులకు సైతం దేవుడిచ్చిన ఒక వరం. చిన్ని చిన్న పాపలు ఇళ్లలో నడియాడుతుంటే ఆ ఇళ్లే నందనవనంగా ఉంటుంది. కాని కొంతమంది దంపతులకు పెళ్లై సంత్సరాలు గడిచినా సంతానం కలగదు. ఇటువంటి వారి బాధ వర్ణణాతీతం. అటువంటి వారు పెద్ద నగరాలకు వెళ్లనవసరం లేకుండా చిలకలూరిపేట ప్రాంతంలోనే పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న వారి ఆకాంక్షలను నెరవేరుస్తుంది పట్టణంలోని వరలక్ష్మీ సంతాన సాఫల్య కేంద్రం. ఐసిఎమ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొన్న వైద్యులు ఎంతో మంది దంపతులకు సంతానం కలగడానికి కారణమయ్యారు. సంతానాన్ని పొంది మాతృత్వాన్ని చవి చూసిన ఎంతో మంది దంపతులు వైద్యుల కృషిని ప్రశంసిస్తున్నారు.
యడ్లపాడు మండలం సందేపుడి గ్రామానికి చెందిన దంపతులకు వివాహం అయ్యి 15 సంవత్సరాలు అయ్యింది. వీరు గత 15 సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఉన్నారు. సంతానం కలగకపోవటంతో ఆ దేశంలో అత్యుత్తమ ఆసుపత్రులను సందర్శించారు. కాని ఫలితం లేకుండా పోయింది. ఇంకా తమకు సంతాన సాఫల్యత ఉండదని ఆందోళన చెందారు. ఈక్రమంలోనే ఆ నోటా, ఈ నోటా చిలకలూరిపేట పట్టణంలో ఉన్న వరలక్ష్మీ సంతాన సాఫల్య కేంద్రం గురించి విని ఇక్కడికి వచ్చారు. వైద్యులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ గరికపాటి సిద్ధార్థ లు పూర్తి పరీక్షలు నిర్వహించి, తప్పని సరిగా పిల్లలు జన్మిస్తారని ఆందోళన చెందవద్దని చెప్పి చికిత్స ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలోనే ఆమె పండంటి ఇరువురు కవలకు జన్మనిచ్చింది. మగ,ఆడ కవలలు ఆరోగ్యంతో ఉండటంతో ఆ దంపతులతో పాటు , వారి బంధు మిత్రులు వైద్యులు లను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా లాంటి దేశంలోనే పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా సంతానం కలగని తమకు వరలక్ష్మీ సంతాప సాఫల్య కేంద్రం వైద్యులు కొత్త జీవితాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో కూడా సంతాన సాఫల్య కేంద్ర వైద్యులు అనేకమందికి ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని కలిగించారు. వరలక్ష్మి సంతాన సాఫల్య కేంద్రం వైద్యులు డాక్టర్ వరలక్ష్మి, గరికపాటి సిద్ధార్థ లను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో తమ ఆసుపత్రిలో సంతాన సాఫల్యం కొరకు ఎదురుచూస్తున్న వారికి సేవలందించి వారికి సంతాన భాగ్యం కలిగేలా వైద్యం చేస్తామని అన్నారు.

