చిలకలూరిపేట పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ పక్కన గల గుడి వద్ద ఆదివారం రాత్రి రాజీవ్ సాయి (8) అనే ఎనిమిది సంవత్సరాల బాలుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల వద్ద కోటి రూపాయలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న చిలకలూరిపేట అర్బన్ సీఐ రాజేశ్వరావు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి నుంచే వెతుకులాట ప్రారంభించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్లు ఒక కారులో బాలుని కిడ్నాప్ చేసి నెల్లూరు వైపు వెళ్లినట్లు తెలియడంతో సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అర్బన్ పోలీసులు వెంబడించగా ... డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలుసుకున్న సీఐ తల్లిదండ్రులచే ఒక ఖాళీ బ్యాగు ని పెట్టించి ఆ బ్యాగు వద్దకు వచ్చిన దుండగులను పట్టుకోబోగా కిడ్నాపర్లు ముగ్గురు ఆ బాలుని బయట వదిలేసి కారుతో వెళ్లిపోయినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సుమారు ఐదున్నర సమయంలో కావలి సమీపంలోని ముసులూరు వద్ద ఆ బాలుడిని వదిలి వెళ్లారు. ఆదివారం రాత్రి నుండి సోమవారం తెల్లవారుజాము వరకు సీఐ రాజేశ్వరరావు బృందం ఆ బాలుడు కోసం కిడ్నాపర్ల నుంచి విడిపించడానికి చేసిన శ్రమ వృధా కాలేదు. బాలుడిను సురక్షితంగా తీసుకొచ్చి పల్నాడు ఎస్పీ సమక్షంలో ప్రవేశపెట్టి జరిగిన సంఘటన ఉన్నతాధికారులకు సిఐ రాజేశ్వర వివరించారు. బాలుడి ని రక్షించి తీసుకొచ్చిన సిఐను పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
కోటి రూపాయలు డిమాండ్ చేసిన కిడ్నాపర్ల నుంచి రాజీవ్ సాయిను రక్షించిన అర్బన్ సీఐ రాజేశ్వరరావు