చిలకలూరిపేట పట్టణంలోని 13 వ వార్డుకు చెందిన ఎనిమిది సంవత్సరాల రాజీవ్ సాయి ఆదివారం రాత్రి మిస్ అయినట్లు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో వారి బంధువులు ఫిర్యాదు చేశారు. రాజీవ్ సాయి తల్లిదండ్రులు చెన్నైలో నివసిస్తూ దసరా పండుగ సందర్భంగా చిలకలూరిపేటకు వచ్చి చార్లెస్ కాన్వెంట్ పక్కన గుడిలో పూజ చేస్తూ ఉండగా కరెంటు పోవడంతో రాజీవ్ సాయి మిస్ అయ్యాడు. ఈ విషయంపై ఆదివారం రాత్రి చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదును చిలకలూరిపేట సిఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేశారు.
అయితే రాజీవ్ సాయి (8) మిస్ కాలేదని, అతనిని కిడ్నాప్ చేసినట్లు రాజీవుసాయి కుటుంబం నుండి కోటి రూపాయలు కిడ్నాపర్ డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కోటి రూపాయలు ఇస్తే అబ్బాయిని వదిలేస్తానంటూ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలిసింది. చిలకలూరిపేట పోలీసులు రాజీవ్ సాయిను కిడ్నాపర్ నుండి విడిపించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది.

