చిలకలూరిపేట పురపాలక సంఘ సాధారణ సమావేశం అజెండా చదువకుండానే ముగియటంతో టిడిపి కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ ప్రతిపక్ష నేత గంగా శ్రీనివాసరావు మీడియాతో కౌన్సిల్ హాల్ ఎదుట మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ సమాధానాలు చెప్పవలసి వస్తుందని అజెండా చదవకుండానే ఆమోదిస్తున్నట్లు ప్రకటిస్తున్నారని తెలిపారు. పట్టణంలోని ఒక రోడ్లో బ్రాందీ షాపు ఆక్రమణ స్థలంలో ఉందని మసీదుకు అనుకొని ఉండటం పై ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పదో వార్డులో ఒక భావిపై సుజల పథకం పెట్టినట్లు మున్సిపల్ అధికారులు ఒక లక్ష అరవై వేల రూపాయలు నిధులు విడుదల చేసినట్లు కానీ అక్కడ ఎటువంటి పథకం లేదని తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయం లో ఉన్న శిలాఫలకం ఏమైందని ఆయన ప్రశ్నించారు. విలీన గ్రామాలకు మంచినీరు సరఫరా చేయలేకపోతున్నామని మున్సిపల్ అధికారులు అంటున్నారని ఎన్టీఆర్ సుజల పథకంతో తాము పట్టణంలో అందరికీ స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పినా తమపై కేసులు బనాయించి అడ్డుకున్నారన్నారు. బోర్లు వేసుకోవడానికి అయినా మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వాలని ఆయన కోరారు. పట్టణంలో విష జ్వరాలు ఉన్నాయని డెంగ్యూతో ఇద్దరు చనిపోయినట్లు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్ర లేవాలని గంగా శ్రీనివాసరావు కోరారు. సిల్తు తీయటంలో కుంభకోణం జరిగిందని దానిపై విచారణ జరపాలని రంగా శ్రీనివాసరావు కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ను కలిసి సమస్యలు విన్నవించారు.
కౌన్సిల్ సమావేశంలో సమాధానం చెప్పలేకనే అంశాలు ఆమోదిస్తున్నారు... టీడీపీ