728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 30, 2022

చిలకలూరిపేట కౌన్సిల్ సమావేశం రసాభాస.... నువ్వు ఎవరంటే నువ్వు ఎవరు..?. ఆక్రమణలు తొలగించకపోతే ధర్నా చేస్తాం...


 చిలకలూరిపేట పురపాలక సంఘ సమావేశం ప్రారంభం కాకుండానే ముగిసింది. వాదోపవాదాల మధ్య కే. బి రోడ్లో ఆక్రమణల  గురించి ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి కొంతసేపు గొడవ జేయడం ...సమస్యను పరిష్కరించకుంటే తాము ధర్నాకు సిద్ధమని మున్సిపల్ కమిషనర్ వద్ద తెలియజేయడం జరిగింది. 


చిలకలూరిపేట పురపాలక సంఘ సాధారణ సమావేశం ప్రారంభం కాకుండానే చైర్మన్ రఫానీ అజెండాలోని 46 అంశాలు ఆమోదిస్తున్నట్లు  ప్రకటించారు. సమావేశం  ప్రారంభంగానే టిడిపి కౌన్సిలర్ కొత్త కుమారి మాట్లాడుతూ అజెండాలో సంతకం చేసేటప్పుడు చైర్మన్  చదివారా ...?లేదా కమిషనర్ చదివే అజెండా పెడుతున్నారా అని ప్రశ్నించారు.  అజెండాలో వార్డు ఇన్చార్జిలు పేర్లు ఎందుకు చేర్చినట్లు అని చైర్మన్ ను ప్రశ్నించడంతో సభలో ఎవరు సమాధానం చెప్పలేదు.  వార్డుల్లో కమిషనర్ పర్యటించేటప్పుడు ఎందుకు పిలవడం లేదని టిడిపి మహిళా కౌన్సిలర్లు అందరూ ఒకేసారి గలమెత్తి ప్రశ్నల వర్షం కురిపించారు. వాలంటీర్లు చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారని టిడిపి కౌన్సిల్ పక్ష నేత గంగా శ్రీనివాసరావు అన్నారు.  ఈ విషయంపై వైసీపీ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ ఎక్కడ పెన్షన్ లు అపారో చెప్పండన్నరు. ఈ విషయం పై ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి నువ్వెవరు నువ్వు ఎవరని ఇద్దరు కొంతసేపు వాదనకు దిగారు. ఇంతలో టిడిపి కౌన్సిల్ సభ్యులందరూ చైర్మన్  పోడియం వద్దకు వెళ్లి కేబీ రోడ్లో ఒక బ్రాందీ షాపు మసీదుకు అనుకుని ఉందని మదర్సా కూడా ఉండటంతో పిల్లలకి ఇబ్బందిగా ఉందని ...30 అడుగుల రోడ్డు ఆక్రమించారని దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.  ఈ విషయంపై స్పందించకపోతే తాము ధర్నా కూడా సిద్ధమని టిడిపి సభ్యులు చైర్మన్కు తెలియజేశారు.  ఆక్రమణ వెంటనే తొలగించేలా చర్యలు చేపడతానని రఫాని సమాధానం చెప్పారు. అనంతరం ఒకరినొకరు తోపులాట జరగటంతో అజెండాలోని 46 అంశాలు ఆమోదించినట్లు చైర్మన్ ప్రకటించి వెళ్లిపోయారు.  దీంతో  అజెండాలోని అంశాలు చర్చించకుండానే అన్ని అంశాలు ఆమోదించడంతో కౌన్సిలర్లు నిరాశ చెందారు.  తమ తమ సమస్యలు కౌన్సిల్లో చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం అని వస్తే ....ఇలా వాదోపవాదాల మధ్య అజెండా మొత్తం ఆమోదించడం ఏమిటని గుసగుసలాడారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట కౌన్సిల్ సమావేశం రసాభాస.... నువ్వు ఎవరంటే నువ్వు ఎవరు..?. ఆక్రమణలు తొలగించకపోతే ధర్నా చేస్తాం... Rating: 5 Reviewed By: NEWS UPDATE