728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 5, 2022

చిలకలూరిపేట: కోతి కరిచి మహిళ మృతి... అధికారుల నిర్లక్ష్యం అంటున్న వార్డు ప్రజలు


చిలకలూరిపేట: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని మానుకొండ వారి పాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని మానుకొండ వారి పాలెం గ్రామంలో గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంటి వద్ద టీ తాగుతుండగా షేక్ నాగుర్బి అనే మహిళను  కోతుల సమూహం వచ్చి ఆమె కుడి చేతిని కరిచాయి. వెంటనే చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి లో గాయపడ్డ ఆ.మహిళ చికిత్స చేయించుకుని ఇంటి వద్ద ఉండగా... శనివారం ఉదయం నాగూర్బి అనే మహిళ మృతి చెందింది. గత  సంవత్సరం నుండి కోతులను పట్టుకోమని మున్సిపల్ అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేశామని... వారి నిర్లక్ష్యం వల్లే కోతి కరిచి మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.  ఈ విషయంపై గ్రామ సచివాలయ కార్యదర్శికి చిలకలూరిపేట పురపాలక సంఘ అధికారులకు విషయం తెలియజేసినట్లు తెలుస్తుంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కోతి కరిచి మహిళ మృతి... అధికారుల నిర్లక్ష్యం అంటున్న వార్డు ప్రజలు Rating: 5 Reviewed By: NEWS UPDATE