యువగలం పేరిట పాదయాత్ర లోకేష్ చేస్తుంది చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడానికే అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరపేటలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సి ఓటర్, ఇండియా టుడే సర్వేలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ 56 నుండి 39 శాతానికి పడిపోయిందని పత్తిపాటి పుల్లారావు అన్నారు. బుల్డజర్లు తోన్లేపినా వైసీపీ పార్టీ లేవదని.... వైసీపీకి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని పత్తిపాటి జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర వల్ల 175 నియోజకవర్గాల్లో వైసిపి గెలవకుండా ఇంటికి పోతుందని ఆయన అన్నారు.
యువ గళం పాదయాత్రతో జగన్ ప్రభుత్వం ఇంటి పోక తప్పదు అన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక పథకాలు ఎత్తివేస్తుందని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉన్న పథకాల కంటే రెట్టింపు పథకాలు అమలు చేస్తామని ప్రతిపాటి వెల్లడించారు. జగన్ ప్రభుత్వం లో రైతుబంధు, ఆసరా, చేయూత ఎంతమందికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక సంవత్సరం ఇచ్చి ఆపివేసిన పథకాలు అనేకం ఉన్నాయని, ఆ లిస్టు తాను వెల్లడిస్తానని పత్తిపాటి చెప్పారు. ప్రస్తుతం డిపాజిట్లు దక్కాలి అంటే వైసిపి పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఆపివేసి సక్రమ పద్ధతిలో పాల నిర్వహించాలని పత్తిపాటి అన్నారు. మీ పాలన భరించలేక రాష్ట్ర మొత్తం కదులుతుందని, లోకేష్ బాబుకు అండగా నిలిచిందని మాజీ మంత్రి పత్తిపాటి తెలియజేశారు. ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి జిల్లాకు చెందిన ఇంకో మంత్రి అటు సీఎం జగన్ కూడా ఇంటికి పోక తప్పదు అన్నారు.

