728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 24, 2023

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

పల్నాడు : మహా శివరాత్రి వేడుకలను కోటప్పకొండ తిరునాళ్ళ తరహాలో రాష్ట్ర పండుగ హోదాలో వైభవంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మంగళ వారం కోటప్పకొండ పుణ్యక్షేత్రం లో జిల్లా అధికారులతో నరసరావు పేట నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డిలు మహా శివ రాత్రి వేడుకల నిర్వహణ పై 2 వ సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత త్రికోటేశ్వర స్వామీ వారిని దర్శించు కునేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్, శాసన సభ్యులను ఆలయ ఇ.ఓ వేమూరి గోపి సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం అతిధులను స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి, ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పండుగ నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారి ప్రయాణం సక్రమంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను అడిగి తెలుసు కున్నారు. పండుగకు ముందే జాతీయ రహదారులు, అంతర్గత రహదారులను వెంటనే బాగుచేయాలని సూచించారు. ప్రభలు వచ్చే రహదారులన్నీ త్వరిత గతిన బాగుచేయించాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ఆర్.టి.సి. బస్సులు, తాగునీరు, విద్యుత్తు వంటి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చెత్తను తరలించి పరిశుభ్రత ను ప్రతీ ఒక్కరు కూడా పాటించేలా చూడాలన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్.పి. రవిశంకర రెడ్డి ట్రాఫిక్ నిబంధలను ప్రకారం వాహనాలు వచ్చి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నరసరావు పేట నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో మహా శివరాత్రి {కోటప్ప కొండ తిరునాళ్ళ } వేడుకలు, ప్రభలు ఊరేగింపు జరిగేలా చూడాలని తెలిపారు.సమావేశంలో పాల్నాడు జిల్లా అభివృద్ధి కమిటి చైర్మన్ చుక్కపల్లి రమేష్ ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE