728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 25, 2023

చిలకలూరిపేట: ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై చర్చ... మాకు మంచి నీరు ఇవ్వండి... 6 వేలు లంచం అడుగుతున్నారు... వైసీపీ కౌన్సిలర్ ఆవేదన

చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం ఉదయం 11.30 గంటలకు జరిగింది. ఈ సమావేశము మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షతన జరిగింది. అత్యవసర సమావేశానికి 14 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఇరువురు కో ఆప్షన్ సభ్యులు, 8 మంది టీడీపీ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్లాస్టిక్ నిషేధం,ప్లాస్టిక్ టీ కప్పులు, డైనింగ్ టేబుల్ పై వాడే ప్లాస్టిక్ రోల్స్, కర్రిలు తీసుకువెళ్లే ప్లాస్టిక్ సంచులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకునే ప్లాస్టిక్ సంచులు, వాటర్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు తదితర 13 ఐటమ్స్ కు సంబంధించిన వాటిపై పూర్తి నిషేధంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. ప్లాస్టిక్ ఐటమ్స్ తయారీ ఉత్పత్తిదారులు యూజర్ చార్జీలు మున్సిపల్ అధికారులు ప్రకటించారు. 1500 నుండి పదివేల వరకు అపరాధ రుసుము వసూలు చేయొచ్చని కౌన్సిల్ తీర్మానించింది. 

ఈ సమావేశంలో కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లపై బతుకుతున్న చిన్న వ్యాపారులపై కక్ష సాధించవద్దని ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీలను నిలుపుదల చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై చైర్మన్ రఫాని మాట్లాడుతూ చిన్న వ్యాపారులపై తమకు ప్రేమ ఉందని ...వారిని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదని... ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము ఈ ప్రతిపాదనలు సమావేశంలో పెట్టినట్లు వివరించారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం గ్రీన్ ట్రిబ్యునల్ తదితర విభాగాల వారు చేసిన ఉత్తర్వులు ప్రకారం మాత్రమే ఉత్పత్తిదారులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

చిన్న కవర్లు తెచ్చుకొని అమ్ముకునేవారు గత కొన్ని నెలల నుండి స్టాక్ పెట్టుకోవద్దని తాము చెబుతున్నామని మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు తెలియజేయగా... రెండు వారాల గడువు ఇచ్చి పూర్తి స్టాక్ అమ్ముకునేలా చేయాలని కౌన్సిల్ పక్ష నేత గంగా శ్రీనివాసరావు కోరడంతో చైర్మన్ రెండు వారాల గడువు ఇచ్చి వాటిని పర్యవేక్షించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.

6 వేలు లంచం ఇవ్వాలట... 
సమావేశంలోని అంశాలు చర్చించిన అనంతరం వైసిపి కౌన్సిలర్ ఎడ్ల ఇందిర మాట్లాడుతూ మా వార్డులో వందలాది కుటుంబ లకు గత 25 రోజుల నుండి మంచిని రావడంలేదని బిందెలు తెచ్చి ధర్నా చేద్దామనుకున్నామని తెలిపారు. వార్డులో వాటర్ కు సంబంధించి ఏ పని అడిగిన లంచం అడుగుతున్నారని ఒకరు 6000 రూపాయలు లంచం అడిగారని ఆరోపించారు. 

చిలకలూరపేట లీకులమయం... 
అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ పండరీపురం, పోలిరెడ్డి పాలెం, చౌత్ర సెంటర్ తదితర ప్రాంతాల్లో లీకులు ఉన్నాయని వాటిని సరిచేయాలని కోరారు.

అతనిని మార్చరా... చైర్మన్కు చెప్పిన కౌన్సిలర్లు
వాటర్ వర్క్స్ విభాగంలో ప్రకాష్ అనే వ్యక్తిని ఎందుకు మార్చరని గత కొన్నేళ్లుగా పాతుకుని పోయి ఇష్టం వచ్చినట్లు డబ్బు వసూలు చేస్తున్నాడని పాలక్పక్ష, ప్రతిపక్ష కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానంతరం మున్సిపల్ చైర్మన్ కు తెలిపారు. ఈ విషయం పై స్పందించకపోతే వచ్చే సమావేశంలో వూరు కునేది లేదని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై చర్చ... మాకు మంచి నీరు ఇవ్వండి... 6 వేలు లంచం అడుగుతున్నారు... వైసీపీ కౌన్సిలర్ ఆవేదన Rating: 5 Reviewed By: NEWS UPDATE