728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 6, 2023

పార్టీ మారతాను... నువ్వు కూడా రా ...అని భర్త అంటే నేను వెళతాను!?


 వైసీపీలో ఉండగలిగినంత కాలం ఉంటామన్న సుచరిత...భార్యగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని వ్యాఖ్య...తామంతా వైసీపీ కుటుంబసభ్యులమన్న సుచరిత.

పార్టీ మారడంపై ఏపీ మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ జగన్ తోనే ఉంటామని ఆమె చెప్పారు. తాను చెప్పిన దానికి తన భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని అన్నారు. ఒకవేళ తన భర్త పార్టీ మారతాను, నీవు కూడా నాతో రా అని పిలిస్తే... ఒక భార్యగా తాను కచ్చితంగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు. 

తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమని తెలిపారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులమని చెప్పారు. జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పార్టీ మారతాను... నువ్వు కూడా రా ...అని భర్త అంటే నేను వెళతాను!? Rating: 5 Reviewed By: NEWS UPDATE